»   » ఎన్టీఆర్ లెజెండ్ కాదు..., అలా పిలవకండి : నందమూరి కళ్యాణ్ రామ్

ఎన్టీఆర్ లెజెండ్ కాదు..., అలా పిలవకండి : నందమూరి కళ్యాణ్ రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్ ఇవి కేవలం మూడక్షరాలే కాదు టాలీవుడ్ అని ఇప్పుడు పిలుచుకుంటున్న తెలుగు సినిమా పర్శ్రమ కి, తెలుగు వాళ్ళం అని చెప్పుకునే ప్రతీవారికీ మిగతా విశయాల్లో ఎన్ని భేదాభిప్రాయాలున్నా ఎన్టీఆర్ అంటే కాదనలేని ఒక గౌరవం. రాజకీయాల్లోకి వచ్చాక ఆయనని విమర్శిస్తూనే ఒక నటుడిగా ఆయన కు అభిమానులమే అని చెప్పిన వాళ్ళు ఎందరో. టాలీవుడ్ చరిత్రలోనే నందమూరి తారక రామారావు ఒక లెజెండ్.... అలా ఇంకొకరిని పిలిస్తే ఎలా ఉంటుందీ..??? సమాధానం ఆయన మనవడు కళ్యాణ్ రామ్ చెప్పాడు..

జూనియ‌ర్ ఎన్టీఆర్

జూనియ‌ర్ ఎన్టీఆర్

అమెరికాలో జ‌రిగిన‌ తానా ఉత్సవాల్లో ఎన్టీఆర్ పేరిట ఇస్తున్న అవార్డ్స్ వేడుక‌కు హాజ‌రైన కల్యా‌ణ్ రామ్ కు నంద‌మూరి అభిమానులు ఘ‌నంగా స్వాగతం పలికారు. ఆ స‌మ‌యంలో వారు జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మాట‌లో చెప్ప‌మ‌ని కల్యాణ్ రామ్‌ను కోరారు. దానికి స‌మాధానంగానే క‌ల్యాణ్ రామ్.. ఆటం బాంబ్ అని చెప్పాడ‌ట‌.

జూనియర్ ఎన్టీఆర్‌ను లెజెండ్ అంటూ

జూనియర్ ఎన్టీఆర్‌ను లెజెండ్ అంటూ

అదే సందర్భంలో ఓ అభిమాని నినాదాలు చేస్తూ జూనియర్ ఎన్టీఆర్‌ను లెజెండ్ అంటూ సంబోధించాడట. ఆ నినాదం కల్యా‌ణ్ రామ్ చెవిన పడటంతో అలా పిలవొద్దని చెప్పాడట. లెజెండ్ అనే పదం పెద్దవాళ్లను ఉద్దేశించి వాడతారని, తన తమ్ముడు ఇంకా చిన్నవాడేనని కల్యాణ్ రామ్ చెప్పాడట.

పెద్ద ఎన్టీఆర్ కు మాత్రమే

పెద్ద ఎన్టీఆర్ కు మాత్రమే

అంతే కాదు తమ విషయం లో ఆ పదం కేవలం పెద్ద ఎన్టీఆర్ కు మాత్రమే దక్కుతుందని అన్నాడు. తాతగారి గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే లెజెండ్ అనే పదం వాడాలని సూచించాడు కల్యాణ్ రామ్. తమ కుటుంబంలో సీనియర్ ఎన్టీఆర్‌ను మాత్రమే లెజెండ్ అని పిలవాలని సూచించాడట కళ్యాణ్ రామ్.

నాకన్నా బాయి కే బాగా తెలుసు

నాకన్నా బాయి కే బాగా తెలుసు

ఇక ఇంకో తమ్ముడు బాలయ్య కుమారుడు నందమూరి మోక్షఙ్ఞ తెరమీదకి వచ్చేది ఎప్పుడూ అన్న మాటకు కూడా.. ఆవిషయం నాకన్నా బాయి కే బాగా తెలుసు, నిర్ణయం ఆయనదే కాబట్టి ఈ ప్రశ్న ఆయనని అడిగితేనే బావుంటుంది అంటూ చ్వ్హెప్పిన కళ్యాణ్ రామ్, మంచి కథ దొరికితే బాబాయ్ తో నటిస్తాను దానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు అంటూ చెప్పాడు...

English summary
“While praising Junior NTR, please do not use world ‘legend’. It is suitable only for Man of the Age Nandamuri Taraka Ramarao. Junior NTR is like an Atom Bomb”, Kalyan Ram has said reminiscing his grandfather.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu