»   »  అలాంటి ప్రపోజల్స్‌తో రాకండి.. కాజల్ గగ్గోలు

అలాంటి ప్రపోజల్స్‌తో రాకండి.. కాజల్ గగ్గోలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనతా గ్యారేజ్ చిత్రంలో కాజల్ 'నేను పక్కా లోకల్' అంటూ చేసిన ఐటెం సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. కాజల్ కూ మంచి పేరు, రెమ్యూనరేషన్ తెచ్చిపెట్టింది. అంత వరకు బాగానే ఉంది. అదే ప్రస్తుతం కాజల్‌ను ఇబ్బంది పడుతుందట.

కాజోల్ ఐటెం సాంగ్ కు మంచి రెస్పాన్స్ రావడంతో చాలా మంది నిర్మాతలు మా చిత్రాల్లో కూడా ఓ ఐటెం పెట్టండి అని వెంటపడుతున్నారట. దాంతో విసిగిపోయిన కాజల్ ఇక ప్రత్యేక గీతాల్లో నర్తించను తెగేసి చెప్తుందట. మా సినిమాలో ఐటెంసాంగ్‌ ఉంది చేయండి అంటూ నా దగ్గరకు రాకండి అంటూ సున్నితంగా నిర్మాతలకు సూచిస్తుందట.

 Kajal Agarwal

తాను ప్రత్యేక గీతంలో నటించాలంటే .. దానికి ఓ రేంజ్ ఉండాలని, ముఖ్యంగా కిక్ ఉండాలనే షరతు పెడుతుందట. అయితే అన్ని పాటల్లో అలాంటి కిక్ ఉండాలంటే కష్టం కాదా అని కొందరు నిర్మాతలు వాపోతున్నారట. ఆ కిక్, రేంజ్ అంటే ఏంటో అర్థం కాక దర్శకులు తలపట్టుకుంటున్నారట.

ఇటీవల కిక్ ఉంటే పాటల్లో నటించడానికి సిద్ధమనే ప్రకటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఐటెం సాంగులకు దూరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

English summary
Kajal Agarwal is maintaning distance to Item number songs. She has got good respose the song of Pakka local in Janata Garrage. In this junxture few film makers approached to Kajal to do a song for them. There is news that she rejected the their proposals.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu