twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డొనాల్డ్ ట్రంప్ నోట దిల్‌వాలే దుల్షనియా లేజాయేంగే, షోలే.. బాలీవుడ్ సినిమాలపై హాట్ కామెంట్

    |

    భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతుల పర్యటన ఘనంగా ఆరంభమైంది. ఉదయం 11 ప్రాంతంలో ఆహ్మదాబాద్ చేరుకొని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ నుంచి నేరుగా ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన క్రికెట్ స్టేడియం మోతేరాకు చేరుకొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ట్రంప్ మాట్లాడుతూ..

    భారత్, అమెరికాల మైత్రీ

    భారత్, అమెరికాల మైత్రీ

    భారత్, అమెరికాల మైత్రి చిరకాలం సాగాలని ట్రంప్ ఆకాక్షించారు. అన్ని రంగాల్లో సహకారం అందించుకొంటూ ఇరు దేశాలు ముందుకు వెళ్లున్నాయి. ఆర్థిక వ్యవస్థను బలపేతం చేస్తూ అన్ని రంగాల్లో భారత్ పురోగతి సాధిస్తున్నది. ఈ రెండు దేశాల మధ్య సహకారం మున్ముందు ఇలానే కొనసాగుతుంది అని ట్రంప్ అన్నారు.

    భారతీయులు వినోద ప్రియులు

    భారతీయులు వినోద ప్రియులు

    ఇక భారత్‌లో వినోదానికి పెద్ద పీట ఉంది. ప్రతీ ఏటా 2 వేలకు పైగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ రంగాన్ని ఇక్కడ బాలీవుడ్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్‌కు మంచి పేరు ఉంది. ఇక్కడి సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. అమెరికాలో కూడా ఈ సినిమాలకు ఎక్కువగా ప్రేక్షకాదరణ ఉంది.బాలీవుడ్ సినిమాలు గ్రేట్ అని ట్రంప్ అన్నారు.

    Recommended Video

    If Sunny Leone Stand Next To Trump 10 Million People Welcome Him | Filmibeat Telugu
    బాలీవుడ్ సినిమాల్లో

    బాలీవుడ్ సినిమాల్లో

    బాలీవుడ్ చిత్రాల్లో రొమాన్స్, సీన్లు, డ్యాన్సులు, మ్యూజిక్, ఎమోషన్స్, డ్రామా ఆకట్టుకునేలా ఉంటాయి. ఇక్కడ దిల్‌వాలే దుల్హనియా లేజాయంగే (డీడీఎల్‌జే), షోలే లాంటి క్లాసికల్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ఇక్కడి సినిమాలు ప్రముఖుల సృజనాత్మతకు మారుపేరు అని ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు.

    హాలీవుడ్ చిత్రాల్లో ట్రంప్ అతిథి పాత్రలు

    హాలీవుడ్ చిత్రాల్లో ట్రంప్ అతిథి పాత్రలు

    ఇక డొనాల్డ్ ట్రంప్ విషయానికి వస్తే.. సినిమాలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. హోమ్ అలోన్ 2, ది లిటిల్ రాస్కెల్స్ లాంటి హాలీవుడ్ చిత్రాల్లో అతిథి పాత్రలను పోషించారు. ఆ కారణంగానే ట్రంప్‌కు బాలీవుడ్ పరిశ్రమపై మంచి అవగాహన ఉందనే విషయం తెలిసిందే. యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా నటించిన తాజా చిత్రం శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ సినిమాపై ఇటీవల ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

    English summary
    American President Donald Trump praises Bollywood, Dilwale Dulhania Le Jayenge at Motera Stadium.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X