»   » ‘దూసుకెళ్తా’ ఆడియో విడుదల తేదీ, వేదిక

‘దూసుకెళ్తా’ ఆడియో విడుదల తేదీ, వేదిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మంచు విష్ణు హీరోగా బిందాస్‌, రగడ చిత్రాల దర్శకుడు వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దూసుకెళ్తా'. లావణ్య త్రిపాఠి హీరోయిన్. ఆరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌ చివరిదశలో ఉన్న ఈ చిత్రం ఆడియో ను టైమ్స్‌ మ్యూజిక్‌ ద్వారా విడుదల చేయనున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ ఆడియో సెప్టెంబర్ 28న విడుదల కానుంది. హైదరాబాద్ లోని హోటల్ హయిత్ లో ఈ ఫంక్షన్ ని జరపనున్నారు.

విష్ణు మాట్లాడుతూ ''కథకు అతికినట్లు సరిపోయే పేరు అదే. వినోదం, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో మేళవించి ఉంటాయి. నిదానమే ప్రధానం.. అనే మాట అస్సలు పట్టించుకోడు. వేగం కూడా విస్తుపోయేలా దూసుకెళ్తేనే విజయం.. అనేది అతను నమ్మే సిద్ధాంతం. ఆ ప్రయాణంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే ''అన్నారు.

కెరీర్ ఇక అయిపోయినట్లే అని అనుకుంటున్న తరుణంలో 'దేనికైనా రెడీ' చిత్రంతో హిట్ కొట్టిన విష్ణు తన రాబోయే సినిమాలపై చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడు. 'దూసుకెళ్తా' చిత్రంతో పాటు విష్ణు...తన తండ్రి మోహన్ బాబు, తమ్ముడు మనోజ్‌లతో కలిసి మల్టీ స్టారర్ చిత్రంలో కూడా నటిస్తున్నారు.

ఈ చిత్రం టైటిల్ కి తగినట్లే విజయం వైపు దూసుకు వెళ్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు దర్శక, నిర్మాతలు. 'దేనికైనా రెడీ' తర్వాత వినోదాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమిదని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్‌ మురారి, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేస్‌.

English summary
Vishnu Manchu starrer Doosulkeltha’s audio will be released on the 28th September at Park Hyatt Hotel in Hyderabad. This film is a romantic entertainer and is produced on 24 Frames Factory. The film is aiming to have an October release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu