»   » ఉన్న మార్కెట్ ఏమిటీ..పెట్టే బడ్జెట్ ఏమిటీ..?? ఆ సినిమాకి అన్ని కోట్ల బడెట్టా??

ఉన్న మార్కెట్ ఏమిటీ..పెట్టే బడ్జెట్ ఏమిటీ..?? ఆ సినిమాకి అన్ని కోట్ల బడెట్టా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోగా రాజ శేఖర్ ఉండేవాడు. మొత్తంగా బ్లాక్ బస్టర్ లు లేకపోయినా నిర్మాతకి నష్టాలు మాత్రం ఉండేవి కావు. అయితే నెమ్మది నెమ్మదిగా మార్కెట్ లో రాజశేఖర్ చరిష్మా తగ్గుతూ వచ్చింది. ఒక్కడు చాలు లాంటి హిట్ తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలుగా ఆ స్థాయి హిట్ లేదు రాజ శేఖర్ కి...

అచ్చివచ్చిన పోలీస్ పాత్రనే

అచ్చివచ్చిన పోలీస్ పాత్రనే

ఒక దశలో ఇక సినిమాలు ఆపేస్తాడనీ, విలన్ గా ట్రై చేస్తున్నాడనీ వార్తలు వచ్చినా.. గుంటూర్ టాకీస్ దర్శకుడు ప్రవీన్ సత్తారు దర్శకత్వం లో పీఎస్వీ గరుడవేగ మొదలు పెట్టాడు. ఇందులో తనకు ఎప్పటినుంచో అచ్చివచ్చిన పోలీస్ పాత్రనే చేస్తున్నాడు. ఎలాగైనా హిట్టు కొట్టాలని కసిగా ఉన్న రాజశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టులో నటిస్తున్నాడు.

పీఎస్వీ గరుడవేగ

పీఎస్వీ గరుడవేగ

ఇక్కడి వరకూ బాగానే ఉంది గానీ ఈ మధ్య నిర్మాత కోటేశ్వర రాజు వెల్లడించిన బడ్జెట్ వివరాలే కాస్త అనుమానాలు రేపుతున్నాయి. ఎందుకంటే ‘గరుడ వేగ' బడ్జెట్ ఏకంగా రూ.25 కోట్లు అంటున్నాడు నిర్మాత కోటేశ్వర రాజు. తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

25 కోట్ల బడ్జెట్‌తో

25 కోట్ల బడ్జెట్‌తో

రూ.25 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని.. ఏ విషయంలోనూ అస్సలు రాజీ పడట్లేదని చెప్పాడు. అయితే ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ లో రాజశేఖర్ కి లాభాల మాట అటుంచి కనీసం ఆ 25 కోట్లనైనా వెనక్కి తేగల సత్తా ఉందా అంటే మాత్రం కష్టం అనే చెప్పాలి. మరీ నిక్కచ్చిగా అయితే కష్తమే కాదు అసాధ్యం అనాలి..

నమ్మకం అయితే లేదు

నమ్మకం అయితే లేదు

ఇప్పటికైతే ‘గరుడ వేగ' మీద ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కొంచెం ఆసక్తి అయితే ఉంది గానీ మరీ 20 కోట్లని దాటి వ్యాపారం జరుగుతుందనే నమ్మకం అయితే లేదు. దీని దర్శకుడు ప్రవీణ్ సత్తారు ట్రాక్ రికార్డు బాగుండటం.. దీని ఫస్ట్ లుక్ కొంత ఆకర్శించటం కొంత వరకూ ప్లస్ అయినా.

గడ్డం గ్యాంగ్ లాంటి అట్టర్ ఫ్లాప్

గడ్డం గ్యాంగ్ లాంటి అట్టర్ ఫ్లాప్

మరీ అన్ని కోట్ల బిజినెస్స్ జరగటం మాత్రం అనుమానమే. ఈ లెక్కన బడ్జెట్ కాస్త అదుపులో ఉండి ఉంటే అంటే పది కోట్లకు మించకుండా ఉండి ఉంటే బావుండేది అని ట్రేడ్ వర్గాల అభిప్రాయం. గత మూడూ నాలుగేళ్ళలో గడ్డం గ్యాంగ్ లాంటి అట్టర్ ఫ్లాప్ తప్ప ఇంకో సినిమా లేదు రాజ శేఖర్ కి.

మిగతా స్టార్ క్యాస్ట్

మిగతా స్టార్ క్యాస్ట్

అయితే మిగతా స్టార్ క్యాస్ట్ కొంత ఆశాజనకంగా ఉంది ముఖ్యంగా విలన్ గా కనిపించనున్న కిషోర్. తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి, ముఖ్యంగా కబాలి, చీకటి రాజ్యం వంటి చిత్రాల్లో విలన్ పాత్రల్లో జీవించి మెప్పించిన కిషోర్..తిరిగి ఒక అత్యంత బలమైన ప్రతినాయకుడి జార్జ్ పాత్ర ని 'పివిఎస్ గరుడ వేగ 126.18ఎం' చిత్రంలో పోషించనున్నాడు.

ఎన్ని హంగులున్నా

ఎన్ని హంగులున్నా

జార్జ్ పాత్ర భారతీయ చలనచిత్ర లో అత్యంత గొప్ప ప్రతినాయకులైన మొగాంబో, గబ్బర్ సింగ్ ని తలపిస్తుంది. అయితే ఎన్ని హంగులున్నా హీరో చరిష్మా అన్నది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయిన టాలీవుడ్ లో రాజశేఖర్ కి ఇప్పుడు గరుడ వేగ పెద్ద హిట్ ని ఇవ్వటం జరుగుతుందా లేదా అన్నది చూడాలి మరి.

English summary
'PSV Garuda Vega 126.18M', directed by Praveen Sattaru and starring the Angry Young Man Dr. Rajasekhar, is currently being shot is made a high cost of Rs.25 crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu