»   » డ్రగ్స్ కేసు: పూరి-రవితేజకు సంబంధించి షాకింగ్ ఎవిడెన్స్ నిజమేనా?

డ్రగ్స్ కేసు: పూరి-రవితేజకు సంబంధించి షాకింగ్ ఎవిడెన్స్ నిజమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ చిత్ర సీమను కుదిపేస్తున్న డ్రగ్స్ వివాదంలో బుధవారం నుండి విచారణ మొదలైంది. అందరి కంటే ముందుగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10.30 గంటలకు పూరి విచారణ ప్రారంభమైంది.

కాగా... ఈ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుండి రకరకాల ప్రచారం జరుగుతోంది. అసలు వాస్తవం ఏమిటో తేల్చాల్సింది పోలీసులే అయినా.... వారు ఏ విషయం తేల్చకముందే రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కీలకమైన ఆధారాలు ఉన్నాయంటూ ప్రచారం

కీలకమైన ఆధారాలు ఉన్నాయంటూ ప్రచారం

సిట్ అధికారుల వద్ద డ్రగ్స్ కేసులో కీలకమైన ఆధారాలు ఉన్నాయని, రవితేజ, పూరిలకు సంబంధించి అత్యంత కీలకమైన ఓ ఫోటో పూరీ జగన్నాథ్ ను ఇబ్బందులు పెట్టవచ్చని ప్రచారం జరుగుతోంది.

Puri Jagannath daughter reacted over Drugs Rumor on Her Father
ఆ ఫోటో చూస్తే నమ్మేస్తారా?

ఆ ఫోటో చూస్తే నమ్మేస్తారా?

అయినా డ్రగ్స్ లాంటి పెద్ద కేసుల్లో కేవలం ఓ ఫోటో చూసి నిర్దారణకు రావడం కష్టమే. ఫోటోలు మార్ఫింగ్ అయినా కావొచ్చు, లేక మరేదైనా డిజిటల్ మాయ అయుండొచ్చు. కేవలం ఇలాంటివి వాటిని బలమైన ఆధారాలుగా తీసుకోవడం జరుగదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

అభిమానుల్లో టెన్షన్

అభిమానుల్లో టెన్షన్

తమ అభిమాన దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో రవితేజ విషయంలో ఇలాంటి కేసులు, రకరకాల వార్తలు రావడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఏం జరుగుతుందో? మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో? తెలియక అయోమయంలో పడ్డారు.

కడిగిన ముత్యంలా వస్తారనే నమ్మకంతో...

కడిగిన ముత్యంలా వస్తారనే నమ్మకంతో...

డ్రగ్స్ కేసులో వస్తున్న ఆరోపణలు, నిందల పర్వం నుండి తమ అభిమాన హీరో, దర్శకుడు కడిగిన ముత్యంలా వస్తారని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. పూరి కుటుంబ సభ్యులు, రవితేజ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇదే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

డ్రగ్స్ కేసు కలకలం: మీడియా ముందుకు హీరో రవితేజ తల్లి

డ్రగ్స్ కేసు కలకలం: మీడియా ముందుకు హీరో రవితేజ తల్లి

తన కుమారుడు రవితేజపై డ్రగ్స్ వ్యవహారంలో రకరకాల ప్రచారాలు, ఊహాగానాలు మీడియాలో వస్తుండటంతో రాజ్యలక్ష్మి మీడియా ముందుకొచ్చారు. రవితేజకు ఎలాంటి దురలవాట్లు లేవని చెప్పే ప్రయత్నం చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పూరి కూతురు సీరియస్ అయింది

పూరి కూతురు సీరియస్ అయింది

డ్రగ్స్ కేసులోలో తన తండ్రిపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది, ఇది తమ పరువు సమస్యలకు సంబంధించిన అంశమని రెండు రోజుల క్రితం పూరి కూతురు వ్యాఖ్యానించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Telugu media Channels reported that, Solid Evidence Against Puri Jagannadh regarding drugs case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu