»   » ‘డైనమైట్’ రిలీజ్ ఆపేసిన మంచు విష్ణు

‘డైనమైట్’ రిలీజ్ ఆపేసిన మంచు విష్ణు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు విష్ణు హీరోగా నటిస్తూ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై తనే నిర్మాతగా నిర్మించిన చిత్రం ‘డైనమైట్'. ఈ సినిమా జూలై 3న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే పలు కారణాలతో ఆ రోజు విడుదల ఆపేస్తున్నట్లు ప్రకటించాడు విష్ణు.

శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో.. డైనమైట్ అవుటండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇప్పటి వరకు నేను చేసిన చిత్రాల్లో ఈ సినిమా యాక్షన్ పార్ట్ సూపర్ గా ఉంటుంది. అందుకు కారణమైన విజయ్ మాస్టర్ కి థాంక్స్. ఈ సినిమాను జులై 3న విడుదల చేయడం లేదన్నారు.


Dynamite release postponed again

సినిమా ఫైనల్ మిక్సింగ్ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో జరుగుతుంది. ఇప్పటి వరకు 75 శాతం ఫైనల్ మిక్సింగ్ పూర్తయింది. అనుకున్నట్లు అన్నీ జరిగితే సినిమాని జూలై 17 లేదా 24న రిలీజ్ చేస్తాం. రిలీజ్ డేట్ లో క్లారిటీ లేదు. అన్నీ సవ్యంగా జరిగితే త్వరలోనే రిలీజ్ డేట్ తెలియజేస్తానని మంచు విష్ణు అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు దేవకట్టా, రచయిత బి.వి.ఎస్.రవి పాల్గొన్నారు.

English summary
Manchu Vishnu said, his next movie Dynamite release on 17 or 24 July.
Please Wait while comments are loading...