మరోసారి వాయిదా పడ్డ ఈ మాయ పేరేమిటో
సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఈ మాయ పేరేమిటో. కావ్యా థాపర్ హీరోయిన్. వి.ఎస్.వ వర్క్స్ బేనర్‌పై రాము కొప్పుల దర్శకత్వంలో దివ్యా విజయ్ ఈ లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్‌తో పాటు గ్లోబెల్ సినిమాస్ సంస్థలు ఈ చిత్రాన్ని నైజామ్, ఆంధ్రా ఏరియాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
ఈ సినిమాను సెప్టెంబర్ 7న విడుదల చేయాలని మొదట భావించినా... పలు కారణాలతో వాయిదా వేశారు. సినిమాను సెప్టెంబర్ నాలుగో వారంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు లవ్, కామెడీ అంశాలు జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు నిర్మాతలు తెలిపారు.

రాహుల్ జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ పొందాడు. హీరో అవ్వాలనే లక్ష్యంతో వైజాగ్ సత్యానంద్ మాస్టర్ దగ్గరకు ట్రయినింగ్ కూడా తీసుకున్నారు. మూడు దశాబ్దాలు పైగా సినిమాల్లో ఫైట్ మాస్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్న విజయ్ మాస్టర్ తన వారసుడిని ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నారు.
రాహుల్ విజయ్, కావ్యా థాపర్ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, రాళ్లపల్లి, ఈశ్వరీరావు, పవిత్రా లోకేశ్, సత్యం రాజేశ్, జోశ్ రవి, కాదంబరి కిరణ్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: విజయ్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: చిన్నా, సాహిత్యం: శ్రీమణి, సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శామ్ కె.నాయుడు, నిర్మాత: దివ్యా విజయ్, దర్శకత్వం: రాము కొప్పుల.


Click it and Unblock the Notifications











