twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పైరసీ: ‘ఈగ’ థియేటర్ సీజ్...

    By Bojja Kumar
    |

    ప్రస్తుతం టాలీవుడ్లో పైరసీ భూతంపై సీరియస్‌గా ముందుకు సాగుతున్నారు అధికారులు. ఇటీవలే పలువురు పైరేట్స్‌ను పట్టుకుని అరెస్టు చేయగా....తాజాగా చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలో ఈగ చిత్రాన్ని పైరసీ చేస్తున్న థియేటర్‌ను సీజ్ చేశారు. ఏపీ యాంటీ పైరసీ సెల్, సురేష్ ప్రొడక్షన్ టీం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.

    థియేటర్లలో జరుగుతున్న పైరసీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ఈ సారి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగింది. ఈ నెల 6వ తేదీన సినిమా రిలీజ్ కాగా..ప్రతి ఫ్రింట్‌పైన వేర్వేరు డిజిటల్ కోడ్ వేసి డిస్ట్రిబ్యూట్ చేసింది. అంతా ఊహించినట్లుగానే సినిమా విడుదలైన రెండు రోజులకే పైరసీ సీడీలు మార్కెట్‌లోకి రావడంతో పాటు ఇంటర్నెట్లో కూడా పైరసీ వెర్షన్ అప్ లోడ్ చేశారు.

    ఆ పైరసీ వెర్షన్ లోని డిజిటల్ కోడ్ ఆధారంగా దీన్ని ఎక్కడ పైరసీ చేశారో కనిపెట్టారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలోని గౌరీశంకర్ థియేటర్లో సినిమా పైరసీ జరిగినట్లు గుర్తించారు. సురేష్ ప్రొడక్షన్స్ ప్రతినిధి ఆ థియేటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ థియేటర్‌ను సీజ్ చేశారు. అయితే థియేటర్ యజమాని మాత్రం తనకు పైరసీతో సంబంధం లేదని, ఎవరు ఇందులో పాల్గొన్నారో విచారణ జరుపాలని అంటున్నారు.

    నాని, సమంత, సుదీప్ ప్రధాన తారాగణంగా రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఈగ' చిత్రం తెలుగు సినిమా పరిశ్రమకే గర్వకారణమైన చిత్రంగా నిలిచింది. హాలీవుడ్ రేంజిలో ఈచిత్రం విజువల్ ఎఫెక్ట్స్, రాజమౌళి డైరెక్షన్, సుదీప్ నటన సినిమాకు హైలెట్‌గా అయ్యాయి. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించారు. కీరవాణి సంగీతం అందించారు.

    English summary
    The AP anti-piracy cell, Suresh Productions Pvt. Ltd have busted a gang which was involved in the piracy of S S Rajamouli’s Eega. After the film released across the state on July 6, Lakshman Rao, an executive of Suresh Productions in Tirupati, filed a complaint with the police department that their film is being pirated from Gowrishankar Theatre in Varadayyapalem in Chittoor District.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X