twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి 'ఈగ' కు అరుదైన పురస్కారం

    By Srikanya
    |

    హైదరాబాద్: రాజమౌళి 'ఈగ' మరో విజయం సాధించింది. ఈ సినిమాలో కళా దర్శక పరంగా కీలకమైన కృషి చేసిన కళాదర్శకుడు రవీందర్‌కి అరుదైన పురస్కారం లభించింది. కళాదర్శకుడు రవీందర్‌, ప్రతిష్టాత్మకమైన బ్రెజిల్‌ చిత్రోత్సవంలో పురస్కారం అందుకొన్నారు. 'ఈగ'లో కనిపించిన ప్రతి వస్తువూ నిజం కాదు. కళాదర్శకుడు సృష్టించినవి చాలా ఉన్నాయి. సమంత మెడలో లాకెట్‌, విలన్ ఇల్లూ, తనని భయపెట్టిన ఈగ... ఇలా ఎన్నో కళా దర్శకుడు ప్రతిభను తెలిపే అంశాలు ఉన్నాయి. అందుకే ఈ అవార్డ్ రవీందర్ ని వరించింది. ఈ సందర్భంగా 'ఈగ' సినిమా వెనుక ఆయన పడిన కష్టాన్ని మీడియాతో చెప్పుకొచ్చారు.

    రవీందర్ మాట్లాడుతూ.... ''ఈగ సినిమా పెద్ద విజయం సాధించింది. అయితే అందులో ఆర్ట్‌ విభాగం గురించి ఎవరూ మాట్లాడుకోలేదు. ఇందులో కళాదర్శకుడికి పనేముంది? అని అడిగినవాళ్లూ ఉన్నారు. అందులో సంతోషం, బాధ రెండూ ఉన్నాయి. ఎందుకంటే ఏది సెట్టో, ఏది నిజమో తెలియకుండా చేయడం కళా దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. 'ఇంత కష్టపడి పనిచేసినా గుర్తింపు రాలేదేంటి?' అనే బాధ కూడా ఉంది. బ్రెజిల్‌ చిత్రోత్సవంలో నా శ్రమకి గుర్తింపు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది'' అన్నారు.

    అలాగే... ''రాజమౌళిగారు కథతో పాటు ఎక్కడెక్కడ సెట్‌ అవసరమో చెప్పారు. దాంతో నా పని సులభం అయ్యింది. సుదీప్‌ ఇల్లు సెట్‌ వేసిందే. ఆ ఇంట్లో కనిపించిన ప్రతి వస్తువూ మేం తయారు చేసిందే. కుర్చీ, సోఫా, గాజు బొమ్మలు ఇవేం బయట కొనలేదు. ఈ సినిమాలో హీరోయిన్ ఓ మైక్రో ఆర్టిస్ట్‌. చిన్న చిన్న వస్తువుల్ని తయారు చేయడం ఆమె హాబీ. అందుకే ఆ పాత్ర కోసం కంటికి కనిపించని చిన్న చిన్న బొమ్మల్ని రూపొందించాల్సి వచ్చింది అన్నారు.

    అంతేకాదు.. ఈ సినిమా కోసం డమ్మీ ఈగల్ని తయారు చేయాల్సివచ్చింది. వాటి కోసం ఆవాలు, బియ్యం, ప్లాస్టిక్‌ ముక్కలూ వాడాం. ఈగతో సుదీప్‌ నటించిన సన్నివేశాలన్నీ సీజీలోనే తీశాం. అక్కడ ఈగ ఉండదు. ఉన్నట్టు నటించాలి. ఈగ స్థానంలో ఏ వస్తువైనా పెట్టొచ్చు. కానీ ఆ ఫీల్‌ రాదు. అందుకే అలాంటి సన్నివేశాల కోసం ఈ డమ్మీ ఈగల్ని తయారు చేశాం. పేకప్‌ చెప్పేసిన తరవాత మళ్లీ ఈగల్ని బంగారం దాచినట్టు చిన్న చిన్న పెట్టెల్లో దాచాం. అందులోంచి తీయాల్సివచ్చినప్పుడు కూడా ప్రత్యేకమైన పరికరంతో తీసేవాళ్లం. ఈగల్ని అంత జాగ్రత్తగా చూడాల్సివచ్చింది. సుదీప్‌ ఇంటి సెట్‌కి రెండు నెలలు పట్టింది. అది నిజం ఇల్లు కాదు, సెట్‌ అని చెప్పేంత వరకూ ఎవరికీ తెలీదు. బహుశా ఇవన్నీ జ్యూరీ గుర్తించిందేమో అని చెప్పుకొచ్చారు.

    English summary
    'Eega' has bagged the award in the category 'Best Art Direction' at Brazil's Fantaspoa Film Festival this year. In fact, this revenge drama was the only Indian film in the nominations. Art director Ravinder who is upset over not receiving a single word of appreciation post the release of 'Eega' for his fantastic work can't ask for anything more after this rare honour on an International platform. "It feels really great and extremely satisfying. Thanks to my director and producer for believing in me," responded the talented technician, who is currently working for 'Atharintiki Daredi'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X