నాని ఇంట్లో కమల్ హాసన్ పెయింటింగ్
హైదరాబాద్ : హీరో నాని ఇటీవలే తన ప్రియురాలు అంజనను వివాహమాడిన సంగతి తెలిసిందే. కొత్తకాపురం మొదలు పెట్టిన నాని తన ఇంటిని అందంగా తీర్చి దిద్ది డెకోరేషన్ చేసుకునే పనిలో పడ్డాడు. ఇందులో భాగంగా తన సహ నటుడు, ఆవకాయ్ బిర్యాని ఫేం కమల్ కామరాజు వేసిన పేయింటింగ్స్ ను తెచ్చి తన ఇంట్లో అందంగా అమర్చుతున్నాడు.
వీటిలో కమల్ హాసన్ పేయింటింగ్ కూడా ఉంది. మొదటి నుంచి నాని కమల్ హాసన్‌కు వీరాభిమాని. కమల్ కామరాజు మంచి పేయింటర్ కావడంతో కొన్ని రోజుల క్రితం అతని వద్దకు వెళ్లినప్పుడు తనకు కమల్ హాసన్ పేయిటింగ్ 'క్షత్రియ పుత్రుడు' ఫోజులో కావాలని అడిగాడట, తన మిత్రుడు నాని కోరిక మేకరకు కమల్ కామరాజు ఆ పేయింటింగ్ ను వేసి ఇచ్చాడు.
నాని సినిమాల విషయానికొస్తే...
ప్రస్తుతం నాని గౌతం మీనన్ దర్శకత్వంలో 'ఎటో వెళ్లిపోయింది మనసు' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నాని సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మరో వైపు క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ప్రస్తుతం నాని హీరోగా 'పైసా' చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కేథరిన్, లక్కీ శర్మ హీరోయిన్లుగా చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలింది ఉంది. ఈచిత్రంలో నాని యంగ్ పొలిటీషియన్‌గా కనిపించబోతున్నాడు.


Click it and Unblock the Notifications