»   » 'మగధీర' కన్నా పెద్ద హిట్టువతుంది...రామ్ గోపాల్ వర్మ

'మగధీర' కన్నా పెద్ద హిట్టువతుంది...రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నువ్వేదయితే కాన్సెప్ట్ నాకు చెప్పావో...అది తెరకెక్కిస్తే.."మగధీర" కన్నా పెద్ద హిట్టు అవుతుంది అంటూ రాజమౌళి తాజా ప్రాజెక్టు "ఈగ" గురించి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు. అలాగే నువ్వు "ఈగ" ను త్వరలో ప్రారంభించబోతున్నావని తెలిసి నేను సూపర్ గా ధ్రిల్లయ్యా అంటూ స్పందించారు. ఇక "ఈగ" గురించి రాజమౌళి చెబుతూ..నేను "ఈగ" ని మొదట చాలా కాఫీ త్రాగినంత ఈజీ చేసేయచ్చు అనుకున్నా. కానీ కథ విస్తృతి పెరుగుతున్న కొలిదీ రియలైజ్ అయ్యిందేమిటంటే...అదంత ఈజీ కాదుని అలగే చాలా ఇంట్రస్టింగ్ సీన్స్ వస్తున్నాయి చాలా ఎక్సైట్ మెంట్ గా ఉందని చెప్పారు రాజమౌళి. ఇక ప్రభాస్ చిత్రం నెక్ట్స్ మార్చిలో మొదలవతుంది. ఈ లిమిటెడ్ సమయంలో ఓ చిన్న సినిమా చేస్తాను. ఇక "ఈగ" చిత్రం యానిమేషన్ మరియు లైవ్ యాక్షన్ తో నిండి ఉంటుంది రాజమౌళి చెప్తున్న సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu