twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ 'శ్రీరామ రాజ్యం' పాటల విశేషాలు

    By Srikanya
    |

    బాపు దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'శ్రీరామరాజ్యం'. నందమూరి బాలకృష్ణ శ్రీరామునిగా, సీతాదేవిగా నయనతార నటించిన చిత్రం పాటలను ఈ నెల 15న భద్రాచలంలో విడుదల చేయనున్నారు. ఈ సెందర్బంగా నిర్మాత యలమంచిలి సాయిబాబు విశేషాల్ని వెల్లడిస్తూ ఇళయరాజా స్వరపరచిన గీతాలు భక్తి భావాన్ని పెంపొందింపజేసేలా ఉంటాయి. ఇందులో ఎనిమిది పాటలుంటాయి. వాటితో పాటు ఏడు స్వల్ప నిడివి గీతాలున్నాయి. వీటిని జొన్నవిత్తుల రచించారన్నారు.

    చిత్ర విశేషాలు గురించి చెబుతూ.. రామాయణం అందరికీ తెలిసిన కథే. అయినా ప్రతిసారీ ఏదో ఓ కొత్త విషయం మనకు బోధపడుతుంటుంది. ఈ కథని బాపు తనదైన శైలిలో ఆవిష్కరించారు. ప్రతి సన్నివేశంలోనూ బాపు - రమణల ముద్ర కనిపిస్తుంది. రామునిగా బాలకృష్ణ, సీతగా నయనతార తమ పాత్రలో ఒదిగిపోయారు. వారి నటన అన్ని వయసులవారికి నచ్చుతుంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా నాలుగు సెట్లను నిర్మించాం. దర్బారు, కౌసల్య మందిరం, పూజా మందిరం, ఏకాంత మందిరం సెట్లు కనువిందు చేస్తాయి. వీటిని కళాదర్శకుడు కిరణ్‌ తీర్చిదిద్దారు. మరో కళా దర్శకుడు రవీందర్‌ ఆధ్వర్యంలో 14 ఆశ్రమాలను నిర్మించాం అన్నారు. ఇటీవలే డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

    English summary
    Makers of Sri Rama Rajyam film are planning to release the audio on August 15 at Lord Rama Temple in Bhadrachalam. Music is composed by Ilayaraja.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X