Don't Miss!
- News
చంద్రబాబుకు పొంచివున్న ప్రమాదం: ఎలాగో వివరించిన మంత్రి రోజా..!!
- Sports
IND vs NZ: చెలరేగిన స్పిన్నర్లు.. చేతులెత్తేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు! భారత్ టార్గెట్ ఏక్‌సౌ!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
కాపీ కొట్టారు: ‘దృశ్యం’ నిర్మాతలకు ఏక్తాకపూర్ నోటీసులు
హైదరాబాద్: 'దృశ్యం' నిర్మాతలకు బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ లీగల్ నోటీసులు పంపారు. జపనీస్ రచయిత కీగో హిగాషినో రాసిన పుస్తకంలోని విషయాలను కాపీ కొట్టి 'దృశ్యం' చిత్రాన్ని తెరకెక్కించారని ఏక్తా కపూర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు.
జపనీస్ రచయిత రాసిన 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' పుస్తకం ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు ఏక్తా కపూర్ ఆ పుస్తకం రైట్స్ కొనుగోలు చేసారు. అయితే 'దృశ్యం' చిత్రం చూసిన ఏక్తా కపూర్ అండ్ టీం తాము రైట్స్ దక్కించుకున్న పుస్తకంలోని విషయాలతో 'దృశ్యం' సినిమా ఉండటంతో షాక్‌కు గురైందట.

ఒరిజినల్ మళయాలం వెర్షన్ 'దృశ్యం' చిత్రానికి జీతు జోసెఫ్ కథ రాయడంతో పాటు దర్శకత్వం వహించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ హీరోగా సేమ్ టైటిల్‌తో రీ మేక్ చేసారు. త్వరలో కమల్ హాసన్‌తో తమిళంలోనూ రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే....'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' పుస్తకం కాన్సెప్టును కాపీ కొట్టారనే ఆరోపణలను జీతు జోసెఫ్ తోసి పుచ్చారు. తాను స్వయంగా ఆ కథ రాసుకుని దర్శకత్వం వహించినట్లు మళయాల మనోరమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరి తాజాగా ఏక్తా కపూర్ లీగల్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఏ జరుగబోతోంది అనేది తేలాల్సి ఉంది.