»   » 'దృశ్యం' హిందీ వెర్షన్...డిటేల్స్

'దృశ్యం' హిందీ వెర్షన్...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : తెలుగులో వెంకటేష్, మీనా కాంబినేషన్ లో దర్శకురాలు శ్రీ ప్రియ రూపొందించిన చిత్రం 'దృశ్యం' . ఈ చిత్రం ఇప్పుడు హిందీలోకి వెళ్తోంది. అయితే అక్కడ ఈ చిత్రం వెర్షన్ మారుతుంది. ఈ చిత్రానికి మూలమైన నవల 'ది డివోషన్‌ ఆఫ్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌' ఆధారంగా ఈ చిత్రాన్ని అక్కడ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రంలో కత్రినా కైఫ్‌ నటించబోతున్నట్లు బాలీవుడ్‌ సమాచారం.

'ది డివోషన్‌ ఆఫ్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌'. ఇది జపాన్‌లో బాగా ప్రాచుర్యం పొందిన నవల. కేగో హిగాషినో రచించిన ఈ నవల జపాన్‌లో ఎన్నో అత్యుత్తమ అవార్డులు అందుకొంది. ఈ కథను బాలీవుడ్‌ వెండితెరపై చూపించాలనుకుంటున్నారు దర్శకుడు సుజయ్‌ ఘోష్‌. దీన్ని ఏక్తా కపూర్‌ నిర్మిస్తారు.

Ekta Kapoor to sign Katrina Kaif for a psychological thriller

ఈ చిత్రంలోని ప్రధాన పాత్రకు కత్రినా కైఫ్‌ని సంప్రదించడంతో పాటు ఆమెకు ఈ పుస్తకాన్నీ పంపించారట. కత్రినాకు ఈ కథ నచ్చడంతో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుంది.

ఇక ఇప్పటికే దక్షిణాదిన 'దృశ్యం' సినిమా రిలీజై ఆకట్టుకుంటోంది. తొలుత మలయాళంలో జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో వచ్చిన దృశ్యం సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది. మలయాళంలో యాభైకోట్లు వసూలు చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది. మోహన్‌లాల్‌, మీనా జంటగా నటించారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్న ఒక కుటుంబంలో జరిగిన ఒక సంఘటన ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనే పాయింట్‌తో తీసిన ఈ చిత్రం రీమేక్‌ హక్కులు తీసుకుని కన్నడ, తెలుగు భాషల్లో రూపొందించారు. తెలుగు చిత్రంలో వెంకటేశ్‌, మీనా నటించగా సీనియర్‌ నటి శ్రీప్రియ దర్శకత్వం వహించారు.

తెలుగు 'దృశ్యం' ఇటీవలే విడుదలై సక్సెస్‌బాటలో ఉంది. ఇప్పుడు 'దృశ్యం' కథపై వివాదం మొదలైంది. జపాన్‌ భాషలో వచ్చిన 'ది డివోషన్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌' అనే నవలా హక్కులను ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత ఏక్తాకపూర్‌ తీసుకున్నారు. హిందీలో చిత్రం నిర్మించే ఆలోచనతో ఉన్నారు. ఆమె చేస్తున్న ఆరోపణ ఏమంటే నవలలోని ప్రధానాంశాలను ఆధారంగా చేసుకుని 'దృశ్యం' సినిమా తీశారనేది.

English summary
Ekta Kapoor will be producing a project, a psychological thriller that will have Katrina Kaif in lead. Interestingly ‘Kahaani’ famed helmer Sujoy Ghosh will be directing this film - which in fact is an adaptation of the Japanese bestseller, ‘The Devotion Of Suspect X’ written by Keigo Higashino.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu