ముగిసిన సుదీప్ కిచ్చ, అజయ్ దేవగన్ ట్విట్టర్ ఫైట్.. స్టార్ హీరోల మధ్య చిచ్చు పెట్టిన విషయం ఏమిటంటే?
కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ కిచ్చ, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్‌కు మధ్య వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిందీ భాషపై సుదీప్ చేసిన వ్యాఖ్యలను అజయ్ దేవగన్ అభ్యంతరం తెలుపుతూ చేసిన ట్వీట్లు వారిద్దరి మధ్య వివాదంగా మారింది. సుదీప్ కిచ్చ. అజయ్ దేవగన్ మధ్య కొనసాగిన ట్వీట్ల వార్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే వారిద్దరి మధ్య ఎలాంటి ట్వీట్లు చోటు చేసుకొన్నాయంటే..

హిందీ జాతీయ భాష కాదు..
సుదీప్ కిచ్చ ఇటీవల తాను నటించిన సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. హిందీ మన జాతీయ భాష కాదు అని ఘాటుగా స్పందించారు. అయితే సుదీప్ కిచ్చ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి.

కన్నడ సినిమాలు హిందీలో డబ్బింగ్ ఎందుకు?
ఇక సుదీప్ కిచ్చ చేసిన వ్యాఖ్యలపై అజయ్ దేవగన్ స్పందిస్తూ.. నా సోదరుడా.. మీరు చెప్పిన ప్రకారమే.. హిందీ మన జాతీయ భాష కాకపోతే.. మీ మాతృభాషలో రూపొందిన సినిమాను హిందీలో ఎందుకు డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు? హిందీ మా మాతృభాష. ఇక భవిష్యత్‌లో కూడా హిందీ జాతీయ భాషగానే ఉంటుంది. జనగణమన అంటూ అజయ్ దేవగణ్ హిందీలో ట్వీట్ చేశారు.

భారతీయులుగా గుర్తించరా?
అయితే అజయ్ దేవగన్ ట్వీట్‌కు సుదీప్ కిచ్చ స్పందిస్తూ.. అజయ్ దేవగన్ సార్.. మీరు హిందీలో పంపిన సందేశాన్ని అర్ధం చేసుకొన్నాను. అందుకే హిందీ భాషను గౌరవిస్తాం. అందుకే ఆ భాషను నేర్చుకొన్నాం. అందుకే నేను కన్నడ భాషలో టైప్ చేసిన నా స్పందనను తెలియజేయలేదు. అది మా తప్పుగా భావించవద్దు. అలాగని మమ్మల్ని భారతీయులుగా భావించరా? అని ఇంగ్లీష్‌లో సుదీప్ సెటైర్ వేశాడు.

ఏ పరిస్థితుల్లో అన్నానో తెలుసా?
అజయ్ దేవగన్ హిందీలో చేసిన ట్వీట్‌కు సుదీప్ కిచ్చ మరోసారి స్పందిస్తూ.. అజయ్ దేవగన్ సర్.. నేను ఏ పరిస్థితుల్లో అన్నానో.. ఎందుకు? ఏమి అన్నానో అనే విషయాన్ని నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసినప్పుడు వివరిస్తాను. నేను ఎవరి మనోభావాలను గాయపరచకుండా.. ఎవరిని రెచ్చగొట్టడానికి వ్యాఖ్యలు చేయలేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను అని సుదీప్ క్లారిటీ ఇచ్చారు.

సుదీప్... యూ ఆర్ మై ఫ్రెండ్
హాయ్ సుదీప్ కిచ్చ.. నీవు నాకు మంచి స్నేహితుడివి. మన మధ్య చోటు చేసుకొన్న అపార్థాన్ని క్లియర్ చేసినందుకు థ్యాంక్స్. నేను ఎప్పుడూ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే అని భావిస్తాను. మనం అన్ని భాషలను గౌరవించాలి. ప్రతీ ఒక్కరు తమ భాషను గౌరవించాలని కోరుకొంటారు. ట్రాన్స్‌లేషన్‌లో అపార్థాలు చోటుచేసుకొన్నాయి అని సుదీప్ ట్వీట్‌తో వివాదానికి ముగింపు పలికేందుకు చొరవ తీసుకొన్నారు.

ఆపార్థానికి ముగింపు పలికిన స్టార్ హీరోలు
అయితే సుదీప్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన అజయ్ దేవగన్ ట్వి్ట్టర్‌లో ఇంగ్లీష్‌లో మెసేజ్ చేసి సానుకూలంగా స్పందించాడు. ట్రాన్స్‌లేషన్, ఇంటర్‌ప్రెటేషన్ వల్ల ఇలాంటి సమస్య వచ్చింది. ఆ కారణంగానే నేను పెద్దగా రియాక్ట్ కాలేదు. నేను మిమ్మల్ని బ్లేమ్ చేయడం లేదు. మీరు ఇచ్చిన ట్వీట్‌తో హ్యాపీగా ఫీలయ్యాను అంటూ ఈ వివాదానికి సుదీప్ కిచ్చ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











