»   » ఇంటర్ నెంట్ మూవీ డేటా బేస్ టాప్ లిస్ట్ లో ‘రోబో’

ఇంటర్ నెంట్ మూవీ డేటా బేస్ టాప్ లిస్ట్ లో ‘రోబో’

Posted By:
Subscribe to Filmibeat Telugu

శంకర్ దర్శకత్వంలో ఇండియాలోనే అత్యంత భారీ చిత్రంగా రూపొందిన 'ఎందిరన్" ఐఎండిబి వెబ్ సైట్ ర్యాంకింగ్ లో 39వ స్థానంలో నిలబడింది. 10పాయింట్లకు 7.4 పాయింట్లతో ఈ స్థానం దక్కింది. మొత్తం 250 సినిమాల్లో 6 భారతీయ సినిమాలు మాత్రమే టాప్ 50లో చేరగలిగాయి. విక్రమాదిత్య మోత్వాని రూపొందించిన 'ఉడాన్" 6వ స్థానంలో, దివాకర్ బెనర్జీ 'లవ్ సెక్స్ అండ్ ధోకా" 15వ స్థానం, అనుష రిజ్వి 'పీప్లీ లవ్" 17వ స్థానం, అభిషేక్ చాబే 'ఇష్కియా" 23, సంజయ్ లీలా బన్సాలీ 'గుజారిష్"41, విజయ్ లాల్వాని 'కార్తీక్ కాలింగ్ కార్తీక్" 47 స్థానాల్లో వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ని సంపాదిస్తుందనుకున్న 'ఎందిరన్" ఐఎండిబి ర్యాంకింగ్ లో మాత్రం వెనకబడింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిన ఎందిరన్ తెలుగులోనే పెద్ద హిట్ అయింది. హిందీ లో ప్లాప్ టాక్ తెచ్చుకోగా, తమిళ్ లో ఏవరేజ్ అయింది. ఏది ఏమైనా ఐఎండిబి ర్యాంకింగ్స్ లో ఈ సంవత్సరం ఎందిరన్ టాప్ 50లో నిలవడం ఆనందించాల్సిన విషయమే అంటున్నారు నిర్మాత.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu