For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్ లో ఎవరూ డ్రగ్స్ వాడలేదు.. ఏళ్లుగా పీడిస్తున్న టెన్షన్ కి బ్రేక్.. ఈడీ ఏం తేల్చిందంటే?

  |

  టాలీవుడ్‌ సినీ పరిశ్రమకు డ్రగ్స్ టెన్షన్ తీరిపోయింది. ఇన్నాళ్లు ఒక మరకలా ఉన్న ఈ వ్యవహారం పూర్తిగా తొలగిపోయినట్లయింది. ఆ వివరాల్లోకి వెళితే

  బయటకు తీసి

  బయటకు తీసి


  2017లో హీరో రవితేజ సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో ఆయన డ్రగ్స్ మత్తులో ఉన్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దాన్ని విశ్లేషించిన తర్వాత డ్రగ్స్ కేసులను బయటకు తీశారు. ఆ దెబ్బతో రవితేజ మొదలు పూరి జగన్నాథ్ వరకు చార్మీ మొదలు తనీష్ వరకూ... అరవై మందికిపైగా టాలీవుడ్ ప్రముఖులను పోలీసులు విచారించారు.

  క్లీన్ చిట్ కూడా

  క్లీన్ చిట్ కూడా

  దాదాపుగా అనుమానం వచ్చిన అందరి దగ్గర్నుంచి గోళ్లు, వెంట్రుకలు తీసుకున్నారు. వాళ్లు డ్రగ్స్ వాడారో లేదో తేల‌్చేస్తామని సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ నేతృత్వంలోని ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ బృందం ప్రకటించింది. దాదాపుగా అందర్నీ విచారించిన తర్వాత వారి శాంపిల్స్ పరీక్షలకు పంపారు. ఆ తరువాత కేసు సైలెంట్ అయిపోయింది. ఆ తరువాత క్లీన్ చిట్ కూడా ఇచ్చినట్టు తెలిసింది.

  ఈడీ రంగంలోకి దిగడంతో

  ఈడీ రంగంలోకి దిగడంతో


  అంతా అయిపోయింది అనుకున్న ఈ కేసులో కేసులలో అనూహ్యంగా ఈడీ ఎంట్రీ కావడం మరో సంచలనం సృష్టించినట్టు అయింది. గత ఆగస్టులో మళ్లీ కొంతమందిని విచారణకు పిలిచింది. ఆ విచారణకు హాజరైన వారిలో పూరి జగన్నాథ్, తరుణ్ , చార్మీ, నందు, రానా, రవితేజ సహా 11 మంది ఉన్నారు. అయితే జారీ చేసింది. నాలుగేళ్ల క్రితం నాటి కేసు.. అదీ కూడా తెలంగాణ సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నుంచి సినీ ప్రముఖులకు నోటీసులు అందడం పెను దుమారనికి దారి తీసింది. డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాల వ్యవహారాల్లో నగదు లావాదేవీలు అక్రమమంటు ఈడీ రంగంలోకి దిగింది.

  ఆధారాలు లేకపోవడంతో

  ఆధారాలు లేకపోవడంతో

  ఓ వైపు ఈడీ టాలీవుడ్ సెలబ్రిటీల్ని విచారిస్తూండాగానే ఎవరిపైనా బలమైన ఆధారాలు లేవని కోర్టులో సిట్ ఏమో చార్జిషీట్ దాఖలు చేసింది. డ్రగ్స్‌ కేసులో కెల్విన్ ఇచ్చిన స్టేట్‌మెంట్లలో అనేక మంది సెలబ్రిటీల పేర్లు ఉన్నప్పటికీ తప్పుదోవ పట్టించడానికే అలా చెప్పారని తెలంగాణ ఎక్సైజ్ శాఖ కోర్టుకు చెప్పింది. సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయించినట్లు ఆధారాలు కూడా లేవని తేల్చింది. అయినా సరే
  కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఈడీ కేసును దర్యాప్తు చేసింది. తెలంగాణ పోలీసులే తేల్చేయడంతో ఈడీ కూడా ఏమీ చేయలేక చేతులు ఎత్తేసింది.

  Recommended Video

  Harvey Weinstein Went Behind The Bars
  ఏమీ చేయలేక

  ఏమీ చేయలేక


  సినీ తారలపై డ్రగ్స్ కేసుల్లో ప్రాథమిక ఆధారాలు కూడా లేవన్న కారణంగా ఆ కేసుల్ని ముగించేయాలని ఈడీ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కెల్విన్ సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేశాడని చెబుతున్నాడు కానీ దానికి ఆధారాలు లేవని సిట్ తేల్చడం తో ఈడీ కూడా ఏమీ చేయడానికి లేకుండా పోయింది. తేల్చేశారు. ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ వాడలేదని కోర్టుకు చెప్పినప్పుడు డ్రగ్స్ కొన్నారని దాని కోసమే డబ్బు చెల్లించారని ఈడీ నిరూపించడం కష్టం సాధ్యంగా మారడంతో టాలీవుడ్‌కు పట్టుకున్న డ్రగ్స్ టెన్షన్ తీరిపోయిటన్లయింది. దీంతో టాలీవుడ్ ఊపిరి పీల్చుకున్నట్టు అయింది.

  English summary
  enforcement directorate clean chit to Tollywood people who are interrogated in drugs case.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X