twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి ట్వీట్ చేసి మరీ చెప్పింది

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి చాలా కాలం గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌'. 2012లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొంది. చాలాకాలం తర్వాత వెండితెరపై అతిలోకసుందరి నటన చూసి అందరూ మురిసిపోయారు. ఆ మధ్య జపాన్‌లోనూ సినిమా విడుదలైతే అక్కడా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు రొమేనియాలో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని శ్రీదేవి ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. మెహిది నెబ్బొవు, అడిల్‌ హుస్సేన్‌, ప్రియా ఆనంద్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరీ షిండే దర్శకురాలు.

    ఇంగ్లీష్‌ తెలియక ఇబ్బందులు పడే ఓ గృహిణికి సంబంధించిన ఇతివృత్తంగా 'ఇంగ్లీష్‌ వింగ్లిష్‌' చిత్రాన్ని శ్రీదేవి ప్రధాన పాత్ర పోషించగా ఆర్‌.బాల్కి నిర్మించారు. 14 సంవత్సరాల అనంతరం శ్రీదేవి ఈ చిత్రంలో నటించడం వల్ల అధిక అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని అదే రీతిలో శ్రీదేవి అందుకోగలిగింది. అంతేకాదు ప్రియా ఆనంద్‌ ఈ చిత్రం ద్వారా హిందీ తెరకు పరిచయం అవడం ఒక విశేషం అయితే, గౌరి షిండే తొలిసారి దర్శకత్వం చేపట్టడం మరో విశేషం.ద్విభాషా చిత్రంగా హిందీ తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్‌ చేసి విడుదల చేసారు.

    'English Vinglish' to hit theatres in Romania

    ''ఇంగ్లీష్‌ భాషా పరిజ్ఞానం లేని తొలిదశలో నేను పడిన ఇబ్బందులు, సిగ్గుపడిన విధానం, బాధపడిన అంశాలు గుర్తు కొచ్చాయి ఈ చిత్రంలోని నా పాత్ర గురించి వినగానే. అందుకే ఆ పాత్రలో మమేకం అయ్యాను'' అన్నారు శ్రీదేవి. గ్లామర్‌ నటిగానే కాక, హాస్యం, చిలిపితనం కూడా తను పోషించే పాత్రలో వివిధ రసభావాలను తన మేనులో, ముఖంలో, సంభాషణల్లో పలికించి సత్తాచూపిన నటిగా గుర్తింపు పొందిన శ్రీదేవి 'ఇంగ్లీష్‌ వింగ్లిష్‌' పాత్ర పోషణ విషయంలో అదే తరహాలో భావాలు పలికించింది.

    తనలోని భావాలు వివరించడానికి తగ్గ ఇంగ్లీష్‌ పరిజ్ఞానం లేక భర్త విషయంలోనూ, సమాజంలో ఎదురయ్యే వ్యక్తులతోను ఇబ్బంది పడుతూ, సిగ్గుపడుతూ ఈ లోపాన్ని సవరించుకోడానికి 'ఇంగ్లీష్‌ స్పీకింగ్‌ కోర్స్‌'లో చేరి విశేషంగా కృషి చేసి, ఇంగ్లీషులో పాండిత్యం సంపాదించి ఎదుటివాళ్లను అవాక్కయ్యేలా చేసే 'శశి' పాత్రను శ్రీదేవి పోషించింది. హిందీ వెర్షన్లో అమితాబ్‌ బచ్చన్‌ ఓ ప్రత్యేక పాత్రను పోషించగా, తమిళ వెర్షన్‌కు అజిత్‌ ఓ ప్రత్యేక పాత్రను పోషించారు.నఫ్రెంచి చిత్రాల నటుడు మెహ్డీ నెబ్బోవ్‌, అదిల్‌ హుస్సేన్‌, సుజిత్‌ కుమార్‌, కోరి హిబ్స్‌, రాజీవ్‌ రవీంద్రనాథన్‌, సుమీత్‌ వ్యాస్‌, డామియన్‌ థామ్సన్‌, రాస్‌నాథన్‌ మిగతా పాత్రధారులు. అమిత్‌ త్రివేది సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆరుపాటలు చిత్రీకరణ సినిమా మొత్తంలో 29 నిముషాలు పాటు ఉంది.

    టోరొంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ నెల 14న వరల్డ్‌ ప్రీమియర్‌గా ప్రదర్శించినపుడు మంచి ప్రశంసలు లభించాయి శ్రీదేవికి.సంగీతం అమిత్‌ త్రివేది, ఛాయాగ్రహణం లక్ష్మణ్‌ ఉతేకర్‌, కూర్పు హేమంతి సర్కార్‌ నిర్వహించిన ఈ చిత్రానికి కథ, దర్శకత్వం గౌరి షిండే. హోప్‌ ప్రొడక్షన్స్‌ పతాకాన సునీల్‌ లుల్లా, ఆర్‌ బాల్కి, రాకేష్‌ ఝుంఝన్‌ వాలా, ఆర్‌.కె. దామిని నిర్మించారు. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ ద్వారా విడుదలయిన ఈ చిత్రం 2గం10నిల సేపు ప్రదర్శితమయ్యేలా రూపొందింది.

    English summary
    The Sridevi-starrer ‘English Vinglish’ is all set to hit theatres in Romania. The 51-year-old actress made her Bollywood comeback with the 2012 film which was directed by Gauri Shinde. “’English Vinglish’ releases in Romania for a whole new audience. ErosNow gauris,” Sridevi posted on twitter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X