»   » నాన్న ఒప్పుకోనంటే ఎలా? చిరు 150లో మెగా ఫ్యామిలీ మొత్తం!

నాన్న ఒప్పుకోనంటే ఎలా? చిరు 150లో మెగా ఫ్యామిలీ మొత్తం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి నటించబోయే 150వ సినిమాను రామ్ చరణ్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను నిర్మించేది రామ్ చరణే కాబట్టి మెగాస్టార్ సినిమా జీవితంలో ఈ సినిమా స్పెషల్ గా ఉండాలని మెగా ఫ్యామిలీ కోరుకుంటోంది. అందుకే కథ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. బెస్ట్ స్క్రిప్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య పూరి కథ ఒకే అయినట్లే అయింది కానీ... పూర్తి స్థాయి సంతృప్తి ఇవ్వక పోవడంతో చిరంజీవి రిజక్ట్ చేసారు.

కాగా...ఇంతకాలం ఈ సినిమా గురించిన విషయాలు బయటకు ఇష్టపడని రామ్ చరణ్ తాజాగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. 150వ సినిమాలో తనతో పాటు మెగా ఫ్యామిలీ(పవన్, బన్నీ తదితరులు) మొత్తం ఉంటుందని తెలిపారు. డైరెక్టర్, స్టోరీ ఇంకా ఫైనల్ కానప్పటికీ అందరూ కలిసి ఏదో ఒక సాంగులో కలిసి స్టెప్స్ వేసేలా ప్లాన్ చేస్తున్నట్లు రామ్ చరణ్ తెలిపడం గమనార్హం.

Entire Mega Family To Be In Chiranjeevi 150: Ram Charan

‘నాన్న సినిమాలో నేను ఓ ఐటం చేస్తున్నాను. ఇన్ ఫాక్ట్ మేమంతా కూడా ఇందులో ఐటం చేస్తున్నాం...సినిమాలో నాన్న ఒక్కడే హీరో' అని రామ్ చరణ్ తెలిపారు. ఒక వేళ ఇందుక మీ నాన్న ఒప్పుకోకపోతే అనే ప్రశ్నకు రామ్ చరణ్ స్పందిస్తూ...‘ఇది నేను నిర్మిస్తున్న సినిమా. నేను నా సినిమాకు మార్కెట్ పెంచుకోవడానికి అది అవసరం. అందుకోసం ఏదైనా చేస్తాను. ఆ విషయాలు నాన్న ఎలా చెబుతారు. ఎంటైర్ మెగా ఫ్యామిలీ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తారు' అంటూ రామ్ చరణ్ వ్యాఖ్యానించడం గమనార్హం.

సినిమా కథ, డైరెక్టర్ ఓకే అయిన వెంటనే.. ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్న రామ్ చరణ్ నలుగురు స్టార్ డైరెక్టర్లు సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించబోతున్నాడు. హనుమంతుడి బొమ్మతో పేరులో కొణిదెల వచ్చేలా ఈ బ్యానర్ నేమ్ ఉంటుందట.

English summary
Ram Charan, who is gearing up to produce Chiranjeevi's comeback film, has been tight lipped about the project all this while. But he has finally opened up to reveal some interesting details, talking to a daily. To the joy of mega fans, Ram Charan revealed that entire mega family including Pawan Kalyan, Allu Arjun will be part of Chiranjeevi 150. Though the director and the story is not yet locked, the actor has confirmed that he and his cousins will be shaking a leg with Megastar atleast in a song.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu