For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దాసరి, మంచు విష్ణ ‘ఎర్రబస్సు’ ఆడియో విశేషాలు

  By Bojja Kumar
  |

  దాసరి నారాయణరావు ప్రధాన పాత్రలో మంచు విష్ణు, కేథరిన్ హీరో హీరోయిన్లుగా దాసరి స్వీయ దర్శకత్వంలో 151వ చిత్రంగా రూపొందించిన చిత్రం 'ఎర్రబస్సు'. తమిళ చిత్రం 'మంజ పై'కి రీమేక్ అయిన ఈ చిత్రంలో దాసరి, మంచు విష్ణు తాతా, మనవళ్లుగా నటించారు. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో వేడుక శుక్రవారం జే.ఆర్.సి ఫంక్షన్ హాలులో జరిగింది.

  మోహన్ బాబు ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి ఆడియో సీడీని ఇవివి యువ కళావాహిని అధ్యక్షుడు వెచ్చా కృష్ణమూర్తి రూ. 10,116 లకు కొనుగోలు చేసారు. ఈ మొత్తాన్ని హుదూద్ తుఫాన్ భాదితుల సహాయార్ధం పంపిస్తానని దాసరి తెలిపారు. ఈ ఆడియో వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు కృష్ణ, విజయనిర్మల, కింగ్ మోహన్ బాబు, టి.సుబ్బిరామి రెడ్డి, నిర్మాత రాఘవ, కోదండ రామిరెడ్డి, కీరవాణి, మంచు మనోజ్, జయసుధ, హరిరామజోగయ్య, బి.గోపాల్, అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి, భీమినేని శ్రీనివాసరావు, రాంప్రసాద్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు.

  ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ...''సినిమా గురించి గొప్పలు చెప్పుకోవడం మొదటినుంచి నాకు అలవాటు లేదు. కుటుంబసమేతంగా కలిసి ఈ సినిమాని చూసే విధంగా ఉంటుంది. నా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో 'ఎర్రబస్సు'కు స్థానం ఉంటుంది. తమిళ చిత్రం 'మంజ పై' చూశాను. నాకు, విష్ణుకు బాగుంటుందనిపించింది. ఆ కథను మనకనుగుణంగా మలుచుకుని, కొన్ని పాత్రలు జోడించి ఈ సినిమా చేశాను' అన్నారు.

  స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

  కథ గురించి...

  కథ గురించి...

  నాటి తేరం నేటి తరానికి నచ్చే కథ ఇది. తల్లిదండ్రులకంటే తాత దగ్గర చనువుగా ఉంటారు మనవళ్లు, మనవరాళ్లు. పల్లెటూరిలో పుట్టి, పెరిగిన ఓ తాత, అమెరికాలో సెటిల్ కావాలనే ఓ సాఫ్ట్ వేర్ మనవడి మధ్య సాగే కథ ఇద అన్నారు దాసరి.

  విష్ణులో శోభన్ బాబు

  విష్ణులో శోభన్ బాబు

  విష్ణు అద్భుతంగా నటించాడు. తనలో నాకు శోభన్ బాబు కనబడతాడు. ఇప్పటిదాకా తనకు సరైన డైరెక్టర్ పడలేదని తన నటన చూసిన తర్వాత అనుకున్నాను. క్యాథరీన్ చక్కగా నటించింది. బ్రహ్మానందం తో కాకి డ్యాన్స్ చేయిస్తుంది. చక్కటి సన్నివేశాలు ఉన్నాయి. చక్రి మంచి పాటలు ఇచ్చాడు అన్నారు దాసరి.

  టెన్షన్ పడ్డ విష్ణు

  టెన్షన్ పడ్డ విష్ణు

  ''అమెరికాలో ఉన్నప్పుడు నాకు దాసరిగారు ఫోన్ చేసి నువ్వు, నేను కలిసి ఓ సినిమా చేయబోతున్నాం అన్నారు. ముందు కొంచెం టెన్షన్ పడ్డాను. నాన్నగారు అంకుల్ తో చేయబోతున్నావు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. 40, 50రోజులు ఆయనతో కలిసి వర్క్ చేసాను. దాసరి గారు గ్రేట్ టీచర్. ఎన్ని జన్మలెత్తినా ఆయన బుణం తీర్చుకోలేను. ఈ సినిమా నాకు మైలు రాయి అవుతుంది' అన్నారు.

  మోహన్ బాబు మాట్లాడుతూ

  మోహన్ బాబు మాట్లాడుతూ

  ‘తాత పాత్రలో అద్భుతంగా నటించారు దాసరి గారు. డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవు. ఫ్యామిలీ అందరూ కలిసి చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. సినిమా చూసిన ప్రతి వారిని కంటతడి పెడతారు. నా బిడ్డ ఆయనతో కలిసి నటించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ ఎర్రబస్సు సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు.

  కోరిక తీరిందన్న చక్రి

  కోరిక తీరిందన్న చక్రి

  చక్రి మాట్లాడుతూ ''దాసరిగారితో సినిమా చేయమని మా నాన్నగారనేవారు. నాక్కూడా గురువుగారి సినిమా చేయాలని ఉండేది. ఈ చిత్రంతో ఆ కోరిక నెరవేరింది. దాసరిగారి మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఇకనుంచి ఓ డిఫరెంట్ చక్రిని చూస్తారు'' అని చెప్పారు.

  తారాగణం

  తారాగణం

  దాసరి నారాయణరావు, మంచు విష్ణు, క్యాథరిన్, నాజర్, బ్రహ్మానందం, అలి, కృష్ణుడు, ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు,గౌతంరాజు, హేమ, సురేఖావాణి, విష్ణు ప్రియ, మౌనిక, బేబి నీరాజిత మరియు అతిధి పాత్రలో మురళీమోహన్ తదితరులు నటిస్తున్నారు.

  టెక్నీషియన్స్

  టెక్నీషియన్స్

  ఎన్.రాఘవన్, రచన - రాజేంద్రకుమార్, పాటలు - డా.దాసరి నారాయణరావు, డా.సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల, కరుణాకర్, సంగీతం - చక్రి, సినిమాటోగ్రఫి - అంజి, ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), ఆర్డ్ - బి.వెంకటేశ్వరరావు, ప్రొడక్షన్ డిజైనర్ - జి.తాండవ కృష్ణ, ప్రొడక్షన్ కంట్రోలర్ - ధవళ చిన్నారావు, సెకండ్ యూనిట్ డైరెక్టర్ - రేలంగి నరసింహారావు, నిర్మాత, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - డా.దాసరి నారాయణరావు.

  English summary
  Manchu Vishnu, Catherine Tresa acted Errabus audio release function held at JRC Convention Centre in Hyderbad on Friday (31st Oct) evening.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X