For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నోయల్‌పై ఎస్తర్ సంచలన వ్యాఖ్యలు: పెళ్లైన 16 రోజులకే అలా.. అక్కడ యాసిడ్ పోస్తానన్నాడు అంటూ!

  |

  టాలీవుడ్‌లో ఎంతో మంది ప్రముఖులు ప్రేమ వివాహాలు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వారిలో కొందరు మాత్రమే కలిసి జీవిస్తుండగా.. చాలా మంది పెళ్లైన కొన్నేళ్లకే విడాకులు తీసుకున్నారు. అలాంటి వారిలో సింగర్ కమ్ యాక్టర్ నోయల్ సీన్ - హీరోయిన్ ఎస్తర్ జంట ఒకటి. పెళ్లైన ఆరు నెలలకే విడిపోయిన ఈ జోడీ.. తమ విడాకులకు కారణం ఏంటి అనేది మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఇదో హాట్ టాపిక్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్తర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోయల్‌ క్యారెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ సంగతులు మీకోసం!

  అబద్ధాతో ఎంట్రీ ఇచ్చేసింది

  అబద్ధాతో ఎంట్రీ ఇచ్చేసింది

  హీరోయిన్ ఎస్తర్‌'1000 అబద్దాలు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది. ఇందులో సునీల్‌తో కలిసి నటించిన 'భీమవరం బుల్లోడు' చిత్రం మాత్రమే మంచి పేరును తీసుకొచ్చింది. ఆ తర్వాత 'గరం', 'జయ జానకి నాయక' వంటి కొన్ని సినిమాల్లోనూ కనిపించింది. కానీ, అవేమీ ఆమెకు పెద్దగా గుర్తింపును తీసుకు రాలేదు.

  వాష్ రూమ్‌లో హాట్‌గా తెలుగు పిల్ల డింపుల్: టైట్ ఫిట్‌లో ఆ ఫోజు చూస్తే మెంటలే

  నోయల్ అలా వచ్చి.. ఫేమస్

  నోయల్ అలా వచ్చి.. ఫేమస్

  నోయల్ సీన్ సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించి తనలోని ఎన్నో రకాల టాలెంట్లను బయటపెడుతూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ర్యాప్‌ సాంగులతో బాగా ఫేమస్ అయ్యాడు. పాటల రచయితగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే సమయంలో యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో ఎన్నో సినిమాలో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించి మరిన్ని ఆఫర్లను అందుకున్నాడు.

  నోయల్ - ఎస్తర్ ప్రేమ పెళ్లి

  నోయల్ - ఎస్తర్ ప్రేమ పెళ్లి

  కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలోనే ఎస్తర్.. సింగర్ కమ్ యాక్టర్ నోయల్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ చాలా కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించారు. ఇది బహిర్గతం అయిన తర్వాత తమ ప్రేమను స్వయంగా బయట పెట్టారు. ఈ క్రమంలోనే 2019లో ఈ జంట తమ కుటుంబ పెద్దల సమక్షంలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం జరుపుకుంది.

  బట్టలు లేకుండా అమ్మాయి: అలాంటి పిక్ షేర్ చేసిన దీప్తి సునైనా

  ఆరు నెలల్లోపే విడాకులతో

  ఆరు నెలల్లోపే విడాకులతో

  ప్రేమ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే నోయల్ సీన్ - హీరోయిన్ ఎస్తర్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఇద్దరూ అప్పటి నుంచి దూరంగా ఉండిపోయారు. అయితే, ఈ విషయాన్ని మాత్రం ప్రపంచానికి తెలియనీయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నేళ్ల క్రితమే న్యాయ బద్ధంగా విడాకులు తీసుకున్నట్లు ఇరువురూ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు వెల్లడించి అందరికీ షాకిచ్చారు.

  అతడు అలా.. ఆమె మరోలా

  అతడు అలా.. ఆమె మరోలా


  నోయల్‌తో విడాకులు తీసుకున్న తర్వాత ఎస్తర్ పెద్దగా కనిపించలేదు. కానీ, కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమె వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. అక్కడ ఫుల్ బిజీగా ఉన్న సమయంలో కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే బోల్డు రోల్స్ చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇక, నోయల్ కూడా బిగ్ బాస్‌లోకి వెళ్లి రావడంతో పాటు వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

  టాప్ విప్పేసి యాంకర్ స్రవంతి రచ్చ: నచ్చింది చూసేయ్.. పైన స్వర్గమే అంటూ!

  తొలిసారి పెదవి విప్పిందిగా

  తొలిసారి పెదవి విప్పిందిగా

  నోయల్‌తో విడాకులు తీసుకున్న తర్వాత ఎస్తర్ దానికి గల కారణాలను ఎప్పుడూ చెప్పలేదు. కానీ, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాజీ భర్తపై సంచలన వ్యాఖ్యలు చేసింది. 'పెళ్లైన 16 రోజులకే నోయల్ నిజస్వరూపం తెలుసుకున్నా. అందుకే అతడి నుంచి విడిపోవాలని డిసైడ్ అయిపోయా. ఈ క్రమంలోనే అంత త్వరగా విడాకులు తీసేసుకున్నా' అంటూ వెల్లడించింది.

  బిగ్ బాస్‌లోనూ వాడేశాడని

  బిగ్ బాస్‌లోనూ వాడేశాడని

  తర్వాత ఎస్తర్ మాట్లాడుతూ.. 'నాతో విడిపోయాక నోయల్ నాపై చెడు ప్రచారం చేశాడు. బిగ్ బాస్ షోలో తనపై సింపతీ వచ్చేలా మా విడాకుల ఇష్యూను వాడుకున్నాడు. దీంతో ప్రేక్షకుల్లో సానుభూతి పొందాలని ప్రయత్నాలు చేశాడు. అప్పుడే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని నాకు అనిపించింది. కానీ, దీనిపై నాకు మాట్లాడాలని అనిపించలేదు' అని చెప్పింది.

  Jabardasth New Anchor: జబర్ధస్త్ నుంచి రష్మీ ఔట్.. కొత్త యాంకర్‌గా ఆ సీరియల్ నటి

  యాసిడ్ పోస్తానని వార్నింగ్

  యాసిడ్ పోస్తానని వార్నింగ్

  ఈ ఇంటర్వ్యూలో ఎస్తర్ మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 'నోయల్ నా గురించి బ్యాడ్‌గా చిత్రీకరించడంతో అంతా నాదే తప్పు అనుకున్నారు. దీంతో నాపై ట్రోల్స్ చేశారు. ఓ వ్యక్తి అయితే హైదరాబాద్ వస్తే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. అసలు మా మధ్య ఏం జరిగిందో నాకే తెలుసు. కానీ, ఇన్ని రోజులూ మౌనంగా ఉన్నా. అదే నా తప్పు' అని చెప్పుకొచ్చిందామె.

  English summary
  Tollywood Actress Ester Noronha Recently Participated in An Interview. She Did Sensational Comments on Ex Husband Noel Sean in This Chit Chat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X