»   » అందుకు చింతిస్తున్నా.. తప్పు తెలుసుకొన్న రాంగోపాల్ వర్మ

అందుకు చింతిస్తున్నా.. తప్పు తెలుసుకొన్న రాంగోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

సర్కార్ తప్ప అమితాబ్ బచ్చన్‌తో నేను తీసిన చిత్రాలు అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. అందుకు చింతిస్తున్నాను అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నాడు. ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా రూపొందించలేకపోయాననే తప్పును తాను తెలుసుకొన్నానని ఆయన అన్నారు.

బిగ్ బీతో ఊహించని ఫెయిల్యూర్స్

బిగ్ బీతో ఊహించని ఫెయిల్యూర్స్

అమితాబ్‌తో నిశ్శబ్ద్, వర్మ కీ ఆగ్ చిత్రాలను ఆర్జీవి రూపొందించారు. ఆ చిత్రాలు అత్యంత దారుణంగా పరాజయం పాలయ్యాయి. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ కొంతకాలం వర్మను దూరంగా ఉంచినట్టు వదంతులు వచ్చాయి.

సర్కార్3 ట్రైలర్‌కు భారీ స్పందన

సర్కార్3 ట్రైలర్‌కు భారీ స్పందన

తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో సర్కార్3 అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, మనోజ్ బాజ్‌పేయి, అమిత్ సాద్, యామీ గౌతమి ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తున్నది.

బాల్ థాకరే కుటుంబ కథాంశంతో

బాల్ థాకరే కుటుంబ కథాంశంతో

సర్కార్3 చిత్రం శివసేన అధినేత, దివంగత నేత బాల్ థాకరే కుటుంబ కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ప్రధానంగా బాలాసాహెబ్ థాకరే మనవడు ఆదిత్య థాకరే పాత్రను స్ఫూర్తిగా తీసుకొని కథను అల్లినట్టు తెలుస్తున్నది.

థాకరే మనువడిగా అమిత్ సద్

థాకరే మనువడిగా అమిత్ సద్

సర్కార్3 చిత్రం పూర్తిగా ప్రతీకార నేపథ్యంగా తెరకెక్కినట్టు టీజర్ ద్వారా స్పష్టమైంది. ఈ చిత్రంలో అమితాబ్ మనవడిగా అమిత్ సద్ నటిస్తున్నాడు. అమిత్ సద్ పోషించే పాత్ర ఆదిత్య థాకరేది అనే విషయం విస్తృతంగా ప్రచారమవుతున్నది.

English summary
Ram Gopal Varma said, "Expect of Sarkar, I regret all the films. Many directors including me have taken him for granted, I regret almost every character."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu