»   » రామ్ చరణ్ ఎక్సక్లూజివ్ ఇంటర్వూ (పూర్తి వీడియో)

రామ్ చరణ్ ఎక్సక్లూజివ్ ఇంటర్వూ (పూర్తి వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150 వ చిత్రం గురించి పూర్తి విశేషాలను అందించటమే కాక అనేక విషయాలు మా వన్ ఇండియా ఫిల్మ్ బీట్ బెంగుళూరు ప్రతినిధి ప్రవల్లిక అనుజూరి తో రామ్ చరణ్ ముచ్చటించారు. అందుకు సంభందించిన పూర్తి వీడియోని మీకు ఇక్కడ అందిస్తున్నాం. చూసి ఎంజాయ్ చేయండి.

ఈ ఇంటర్వూలో ఆయన సల్మాన్ ఖాన్ తో చిత్రం గురించి, న్యూ ఇయిర్ ప్లాన్స్ గురించి కూడా మాట్లాడారు. రిట్జ్‌ పత్రిక ఇటీవల నటుడు రామ్‌చరణ్‌కు ‘మోస్ట్‌ అడ్మైర్డ్‌ సెలబ్రిటీ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2015' అవార్డు ప్రదానం చేసింది. ఈ సందర్బంగా బెంగుళూరు వచ్చారు. అప్పుడు ఇంటర్వూ ఇవ్వటం జరిగింది.

అలాగే ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై ఈ సందర్బంగా రామ్ చరణ్ దాదాపు క్లారిటీ ఇచ్చేసారు . తమిళంలో హిట్టయిన 'కత్తి'ని తెలుగులో రీమేక్ చేస్తారని, అదే నాన్న 150వ మూవీ అని హీరో రామ్ చరణ్ కన్ఫార్మ్ చేసి చెప్పేసాడు. బెంగుళూరు‌లో జరిగిన రిట్జ్ ఐకాన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న చెర్రీ, సూచనప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

Exclusive Interview With Ram Charan

రామ్ చరణ్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ చిరు 150వ సినిమా గురించి స్పష్టతనిచ్చారు. కత్తి రీమేక్ చేయనున్న మాట నిజమేనని, తెరకెక్కించేది వినాయక్ అని ఓ పెద్ద చర్చకు తెరదించారు.

గతంలో తమిళంలో హిట్టయిన 'రమణ' సినిమాని తెలుగులో 'ఠాగూర్' మూవీగా వివి వినాయిక్ డైరెక్ట్ చేసిన విషయం తెల్సిందే. చిరంజీవి హీరోగా వచ్చిన ఈ చిత్రం.. అప్పట్లో బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ ఓ రేంజ్‌లో రాబట్టింది. ఈ నేపథ్యంలో 'కత్తి' రీమేక్‌ని కూడా వీవీకి అప్పగించాలని మెగాక్యాంప్ ఓ నిర్ణయానికి వచ్చి ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

English summary
Ram Charan also had a candid talk with Filmibeat.com, where he spoke about the most admirable person in his life, a film with Salman Khan, his new year plans this time and more.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu