పెళ్లికి సిద్దమైన వివాదాస్పద హీరోయిన్

By Bojja Kumar

హైదరాబాద్: హీరోయిన్ నజ్రియా నజీమ్....గురించి మీకు పరిచయం ఉండే ఉంటుంది. అమ్మడు తెలుగులో ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించక పోయినా, ఎన్టీఆర్ తాజా సినిమాలో నటించబోతోందంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. అంతేకాక తమిళంలో ధనుష్‌తో నటించిన ఓ సినిమాలో బొడ్డు సీన్ విషయంలో రచ్చరచ్చ చేసి వివాదాస్పద హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మళయాలీ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. మళయాల నటుడైన ఫహాద్ ఫాజిల్‌ను ఆమె పెళ్లాడబోతోంది. ఈ విషయాన్ని నటుడు పహాద్ తండ్రి, దర్శకుడు అయిన ఫాజిల్ స్వయంగా ఖరారు చేసారు. వీరి వివాహం ఈ సంవత్సరం ఆగస్టులో జరిగే అవకాశం ఉంది.

Fahad Fazil To Marry Nazriya Nazim In August!

ఇది పూర్తిగా అరేంజ్డ్ మ్యారేజ్, ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ వివాహం జరుగుతోంది అని అని ఫాజిల్ స్పష్టం చేసారు. నజ్రియా కూడా తన ఫేస్‌బుక్‌లో ఫహాద్ ఫాజిల్‌లో ఎంగేజ్మెంట్ జరిగినట్లు పేర్కొంది. నజ్రియాతో పాటు, ఫహాద్ ఫాజిల్ తరుపు నుండి కూడా ఈ విషయం ఖరారు కావడంతో పెళ్లిపై పూర్తి క్లారిటీ వచ్చినట్లయింది.

ఇక్కడ కో ఇన్సిడెంట్ ఏమిటంటే....నజ్రియా, ఫహాద్ కలిసి అంజలి మీనన్ దర్శకత్వంలో ఓ మళయాల చిత్రంలో నటించబోతున్నారు. ఆ చిత్రం పేరు 'ఎల్ ఫర్ లవ్'. సో....పెళ్లి ముందు సినిమాలో ఇద్దరూ రొమాన్స్ చేసుకునే అవకాశం వచ్చిందన్నమాట. ఈ చిత్రంలో నత్యా మీనన్, నవీన్ పౌలీ, ఇషా తల్వార్ తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X