Don't Miss!
- News
రాహుల్ పాదయాత్ర భారీ సక్సెస్- 191కి పెరిగిన కాంగ్రెస్ స్కోరు-పార్ట్ 2కు సన్నాహాలు ?
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Finance
Gold price today: పసిడి ప్రియులకు అలెర్ట్.. తాజాగా బంగారం రేట్లు ఇలా.. కొనాలనుకుంటున్నారా?
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
హాస్పటిల్ లో లేను..అవన్నీ రూమర్స్ అంటోంది
హైదరాబాద్ : ‘‘హీరోయిన్ బిందు మాధవికి అస్వస్థత/ బిందు మాధవి ఆరోగ్యం బాగోలేదు'' సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోనూ, వెబ్‌సైట్లలో వస్తున్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవి చదివిన బిందుమాధవ్ షాక్ అయ్యింది. దాంతో ఆమె వెంటనే స్పందించింది. అంతేకాదు ఈ ఫొటోని పెట్టి...తాను ఇప్పుడు తీసుకున్న ఫొటోని పంపి..తన క్షేమం తెలిపింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఆ వార్తలు వాస్తవం కాదని, ఎవరో గాసిప్ రాయుడు సృష్టించిన గాలి వార్త అని స్వయంగా బిందు మాధవి స్పష్టం చేసింది.ప్రస్తుతం చెన్నయిలో ప్రముఖ తమిళ నటుడు సూర్య నిర్మిస్తూ నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్‌లో ఉన్న తాను` అస్వస్థతకు లోనవ్వడం, హాస్పిటల్‌లో జాయినవ్వడం.. ఇవన్నీ రూమర్స్ మాత్రమేనని బిందు మాధవి మీడియాకు తెలిపింది.

'ఆవకాయ్ బిర్యానీ" చిత్రం ద్వారా 2008లో తెలుగుతెరపై అడుగుపెట్టిన తెలుగు అమ్మాయి బిందుమాధవి. ఆ తర్వాత పూరీ తమ్ముడు సాయిరామ్ శంకర్‌కు జోడీగా బంపర్ ఆఫర్, ఓం శాంతి (2009), రామరామ కృష్ణ కృష్ణ, ప్రతిరోజు (2010), పిల్ల జమీందార్ చిత్రాల్లో నటించింది. కానీ ఏవీ ఆమెకు లైఫ్ ఇవ్వలేదు. అలాగే ఈ చిత్రాలతో పాటు మరో మూడు తమిళ చిత్రాల్లోనూ నటించింది.
బిందుమాధవి మాట్లాడుతూ...ఆపర్స్ వస్తున్నాయి కానీ.. వస్తున్న అవకాశాల్లో నచ్చితేనే చేస్తున్నట్లు శెలవిచ్చింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడం కంటే వాటిలో మంచివి ఎంచుకొని చేయడమే ఉత్తమం. అలా చేస్తేనే పరిశ్రమలో పదికాలాల పాటు హీరోయిన్‌గా నిలదొక్కుకోవచ్చునంటూ బిల్డప్ ఇచ్చింది. ఇది విన్న పరిశ్రమ జనాలు బిందుకు అంత సీన్ ఉందా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు ఆమె మాటలు విని నవ్వుకుంటున్నారు.
అలాగే మీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈరోజు బాయ్ ఫ్రెండ్ లేకుండా ఎవరైనా ఉంటారా అని షాకింగ్ కామెంట్స్ చేస్తూ బాయ్ ఫ్రెండ్ కల్చర్ లేని సమాజాన్ని చూపెట్టమని మీడియాకు ఎదురు ప్రశ్న వేసింది బిందు మాధవి. అంతేకాదు తనకు కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని అయితే ఆ విషయం తన వ్యక్తిగతమని సమాధానం ఇచ్చింది బిందు మాధవి.
జూనియర్ సిల్క్ గా తనను పోలుస్తూ కామెంట్స్ చేసే వారి పై తనకు ఎటువంటి కోపం లేదని సిల్క్ స్మితతో తనను పోల్చడం తనకు గర్వంగా ఉందని కామెంట్స్ చేసింది. ప్రస్తుతం బీటెక్ పూర్తి చేసిన బిందు మాధవి త్వరలోనే విదేశాలకు వెళ్ళి ఎంటెక్ చేస్తానని చెపుతోంది. అయితే చాలామంది హీరోయిన్స్ లా తాను ఫేస్ బుక్, ట్విటర్ లలో ఏదో ఒక కామెంట్ పెట్టడం తను ఇష్టం లేదు అని చెపుతూ తనకు సెల్ ఫోన్ అంటేనే చికాకు అని చెపుతోంది.