For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ఫలక్‌నుమా దాస్’ ట్విట్టర్ రివ్యూ... హైప్ అలా, టాక్ ఇలా!

|

'వెళ్లిపోమాకే' సినిమా ద్వారా హీరోగా పరిచయమైన విశ్వక్ సేన్ నాయుడు ఈ సినిమా ద్వారా పెద్దగా గుర్తింపు తెచ్చుకోక పోయినా గతేడాది తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' మూవీలో సైకో వివేక్ పాత్రతో పాపులర్ అయ్యాడు. తాజాగా విశ్వక్‌సేన్ స్వీయ దర్శకత్వంలో 'ఫలక్‌నుమా దాస్' ద్వారా బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశాడు.

హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతంలోని ఫలక్‌నుమా బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఒక్కసారిగా హైప్ పెరిగింది. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారా రావడం కూడా అంచనాలు పెంచింది. రిలీజ్ ముందే సినిమాకు క్రేజ్ రావడంతో హైదరాబాద్ సిటీలో ఒక రోజు ముందే 40కిపైగా పేయిడ్ ప్రీమియర్ వేయగా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మరో వైపు యూఎస్ఏలో సైతం దాదాపు 100 లొకేషన్లలో ప్రీమియర్ షోలు వేశారు.

ఈ మూవీ ద్వారా దర్శకుడు తరుణ్ భాస్కర్ నటుడిగా తెరంగ్రేటం చేశాడు. మలయాళంలో హిట్టయిన 'అంగమలి డైరీస్' మూవీ కథను ఇక్కడి నేటివిటీకి తగిన విధంగా మార్చి రీమేక్ చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తోందో ఓ లుక్కేద్దాం.

ఫస్టాఫ్ ఓకే, సెకండాఫ్ నాట్ ఓకే

ఫస్టాఫ్ డీసెంటుగా ఉంది. సెకండాఫ్ పాయింట్ లెస్ అనే విధంగా ఉంది. తరుణ్ భాస్కర్, రవి పాత్రలో నటించిన వ్యక్తి పెర్ఫార్మెన్స్ బావుంది. ప్రధాన తారాగణం పెద్దగా ఆకట్టుకోలేదు. వివేక్ సాగర్ సంగీతం డిసప్పాయింట్ చేసింది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది.

ముందు బేసిక్స్ నేర్చుకోవాలి

‘ఫలక్‌నుమా దాస్' సినిమా తీసే ముందు దర్శకుడు ముందుగా ఫిల్మ్ మేకింగులో బేసిక్స్ నేర్చుకుంటే బావుండేది. ఈ సినిమా చూస్తుంటే కళను అవమానించినట్లు, అగౌరవ పరిచినట్లు ఫీలింగ్ కలిగింది.

జనాలు వాకౌట్ అంటున్నారు

ఈ సినిమా రిలీజ్ ముందు బాక్సాఫీస్ షేప్ ఔట్ అవుతుందని మాట్లాడుకున్నారు. కానీ ఇపుడు జనాల నుంచి వాకౌట్ అనే మాట వినిపిస్తోంది.

ఈ సినిమాకు రేటింగ్ అంతకు మించి ఇవ్వలేం

‘ఫలక్‌నుమా దాస్' మూవీలో తరుణ్ భాస్కర్ తప్ప... చెప్పుకోదగిన మంచి విషయాలే ఏమీ లేవు. దర్శకుడు విశ్వక్‌సేన్ బాధపడ్డా సరే ఈ చిత్రానికి 1.5/5 కంటే ఎక్కువ రేటింగ్ ఇవ్వలేం.

చాలా ఓపిక ఉండాలి

‘ఫలక్‌నుమా దాస్' సినిమా చూడాలంటే చాలా ఓపిక ఉండాలి. నేటివిటీతో స్లో నేరేషన్ అంటూ కొందరు ఈ సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బోరింగ్ మూవీ

‘ఫలక్‌నుమా దాస్' బోరింగ్ మూవీ అంటూ కొందరు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

చిల్లర క్లైమాక్స్

ఇప్పటి వరకు చాలా రకాల క్లైమాక్సులు చూశాను. కానీ ‘ఫలక్‌నుమా దాస్' ఇలాంటి చిల్లర్ క్లైమాక్స్ ఎప్పుడూ చూడలేదంటూ మరొకరు కామెంట్ చేశారు..

సెకండాఫ్ నచ్చలేదు

‘ఫలక్‌నుమా దాస్' మూవీ ఫస్టాఫ్ ఓకే... కానీ సెకండాఫ్ దారుణంగా ఉంది.

అంచనాలను అందుకోలేక పోయింది

‘ఫలక్‌నుమా దాస్' ఫస్టాప్ బావుంది. అయితే సెకండాఫ్ ఆకట్టుకోలేదు. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. సరైన ముగింపు లేకపోవడం, చాలా విషయాలు ప్రశ్నార్థకంగా ఉండిపోవడం మైనస్ పాయింట్.

English summary
Falaknuma Das movie twitter review by audiance. Falaknuma Das directed by Vishwaksen Naidu. This romantic action thriller movie is produced by Karate Raju, Cherlapally Sandeep Goud & Manoj Kumar Katokar under Vanmaye Creations in association with Vishwak Sen Cinemas, Terranova Pictures & Media9 Creative Works while Vivek Sagar scored music for this movie.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more