»   » షారుక్, సల్మాన్, ఆమీర్, అక్షయ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా?

షారుక్, సల్మాన్, ఆమీర్, అక్షయ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచవ్యాప్తంగా పలు చిత్ర రంగాలకు చెందిన అగ్ర నటుల బ్యాంక్ బ్యాలెన్స్ వివరాల జాబితాను ఓ ఆంగ్ల దినపత్రిక ఇటీవల వెల్లడించింది. ఈ జాబితాలో హాలీవుడ్ నటి, ప్రముఖ వ్యాపారవేత్త డినా మెరిల్ రూ.34 వేల కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. కాగా ఈ జాబితాలో బాలీవుడ్ కు చెందిన షారుక్ ఖాన్ కు 5వ స్థానం, సల్మాన్ ఖాన్ కు 26వ స్థానం, ఆమీర్ ఖాన్ కు 33 స్థానం, అక్షయ్ కుమార్ కు 35 వ స్థానం లభించింది.

4 వేల కోట్ల షారుక్

4 వేల కోట్ల షారుక్

బాలీవుడ్ సూపర్ స్టార్, నిర్మాత షారుక్ ఖాన్ నికర ఆస్తుల విలువ సుమారు రూ.4 వేల కోట్లు అని పేర్కొన్నది. సుమారు రెండు దశాబ్దాల కాల చలన చిత్ర జీవితంలో కుచ్ కుచ్ హోతా హై, బాజీగర్, డర్, ఓం శాంతి ఓం, డాన్, దిల్ వాలే దుల్షనియా లేజాయేంగే లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో షారుక్ కు ఉత్తమ నటుడిగా 8 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఇతర విభాగాల్లో మరో ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకొన్నారు. కోల్ కతా నైట్ రైడర్స్ క్రికెట్ జట్టుకు, రెడ్ చిల్లిస్, డ్రీమ్జ్ అన్ లిమిటెడ్ సంస్థకు యజమానిగా కూడా వ్యవహరిస్తూ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాడు.

కండబలమే కాదు.. సల్మాన్ కు ధన బలం కూడా

కండబలమే కాదు.. సల్మాన్ కు ధన బలం కూడా

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నికర ఆస్తుల విలువ రూ. 1564 కోట్లు. ప్రముఖ సినీ రచయిత సలీంఖాన్ కుమారుడైన సల్లూభాయ్ తన తొలిచిత్రం మైనే ప్యార్ కియా తోనే యువతీ, యువకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. మొదటి సినిమాకే ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకొన్నాడు. ఇప్పటివరకు 80కి పైగా చిత్రాల్లో సల్లూభాయ్ నటించాడు. బీయింగ్ హ్యూమన్ సంస్థను స్థాపించి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు.

ఆస్తుల్లోనూ ఆమీర్ ఫర్ ఫెక్ట్

ఆస్తుల్లోనూ ఆమీర్ ఫర్ ఫెక్ట్

బాలీవుడ్ లో మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా పేరొందిన ఆమీర్ ఖాన్ నికర ఆస్తుల విలువ రూ.1224 కోట్లు. హిందీ చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్ గా, రచయితగా విభిన్న పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. ఆమీర్ నటించిన ఖయామత్ సే ఖయామత్ తక్, లగాన్, 3 ఇడియట్స్, పీకే, దంగల్ చిత్రాలు బ్లాక్ బస్టర్లు గా నిలిచాయి. లగాన్ చిత్రం ఆస్కార్ కు నామినేట్ కూడా అయింది.

ఆస్తుల్లోనూ అక్షయ్ కిలాడియే

ఆస్తుల్లోనూ అక్షయ్ కిలాడియే

ఇండియన్ జాకీ చాన్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకొనే అక్షయ్ కుమార్ నికర ఆస్తులు విలువ రూ. 1156. అక్షయ్ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. అక్షయ్ కిలాడీ, మెహ్రా, ఓ మైగాడ్, హాలీడే, బేబీ, గబ్బర్ ఈజ్ బ్యాక్, ఎయిర్ లిఫ్ట్ లాంటి హిట్ చిత్రాలను అందించాడు. కెరీర్ ఆరంభంలో చెఫ్ గా, స్టంట్ మాస్టర్ గా కూడా పనిచేశాడు. డేర్ టూ డ్యాన్స్ అనే టీవీ రియాల్టీ షోను నిర్వహించాడు. వరల్డ్ కబాడీ లీగ్ లో ఖల్సా వారియర్స్ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్నాడు.

English summary
Bollywood superstars Aamir Khan, Salman Khan, Shah Rukh Khan, Akshay Kumar listed in Worlds top gainers list.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu