»   »  అభిమాని హత్య, కుటుంబాన్ని పరామర్శించటానికి బయిలుదేరిన పవన్

అభిమాని హత్య, కుటుంబాన్ని పరామర్శించటానికి బయిలుదేరిన పవన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: పవన్‌ కల్యాణ్‌ గురువారం ఉదయం తిరుపతి వెళ్తున్నారు. ఈ నెల 21న కర్ణాటకలోని కోలారులో హత్యకు గురైన అభిమాని వినోద్‌ రాయల్‌ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి బయిలుదేరి ఉదయం 10 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టులో దిగుతారు పవన్‌ కల్యాణ్‌.

  ఆ తర్వాత10.45 గంటలకు తిరుపతి ఎస్టీవీ నగర్‌లోని వినోద్‌ రాయల్‌ ఇంటికి చేరుకుంటారని పార్టీ జిల్లా ఇన్‌చార్జి, పవన్‌ కల్యాణ్‌ అభిమాన సంఘాల నాయకుడు కిరణ్‌ రాయల్‌ మీడియాకు తెలిపారు.

  Fan Murder:Pawan Upset, Heads for Tirupati

  ఈ నెల 21న స్నేహితులతో కోలారు వెళ్లిన తిరుపతి యువకుడు, పవన్‌ కల్యాణ్‌ అభిమాన సంఘం నాయకుడు వినోద్‌ రాయల్‌ అక్కడే హత్యకు గురయ్యాడు. సినీ అభిమానుల మధ్య భగ్గుమన్న విభేదాలు కారణంగా వినోద్‌ ఆదివారం హత్యకు గురయ్యాడు. రెండురోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

  మరుసటి రోజు తిరుపతిలో అంత్యక్రియలు జరిగాయి. మొదటి నుంచీ పవన్‌ కల్యాణ్‌ అభిమాన సంఘం నాయకుడిగానూ, జనసేన పార్టీ కీలక నేతగానూ తిరుపతిలో సుపరిచితుడైన వినోద్‌రాయల్‌ ఇటీవల మునికోటి కుటుంబానికి పవన్‌ కల్యాణ్‌ రూ.2 లక్షలు అందజేసినప్పుడు కూడా ఉన్నాడు. వినోద్‌ రాయల్‌ హత్యోదంతం గురించి తెల్సుకున్న పవన్‌ కల్యాణ్‌ ఎంతో బాధపడ్డారనీ, తిరుపతికి బయల్దేరారని కిరణ్‌రాయల్‌ వివరించారు. 

  Fan Murder:Pawan Upset, Heads for Tirupati


  కోలారు సమీపంలోని నరసాపురం పారిశ్రామిక వాడలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆదివారం కోలారు నగరంలో నిర్వహించిన అవయవదానం కార్యక్రమానికి సినీ నటుడు సుమన్ వచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి నుంచి వినోద్ కుమార్ తన మిత్రుడు త్రినాథ్‌తో కలసి కారులో కోలారు వచ్చాడు.

  ఈ సందర్భంగా అవయవ దానం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్తరిస్తామని వినోద్‌కుమార్ చెప్తూ.. తన అభిమాన నటుడికి జై కొట్టాడు. దీనికి మరో హీరో అభిమాని అయిన సునీల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో వారి మధ్య గొడవ మొదలైంది.

  అనంతరం మిత్రులంతా నరసాపురం వద్ద ఉన్న హోటల్ గేట్స్ గ్రాండ్‌కు వెళ్లారు. అక్కడ మళ్లీ గొడవ జరగడంతో సునీల్ వెంట వచ్చిన అక్షయ్‌కుమార్ తన వద్ద ఉన్న కత్తితో వినోద్‌కుమార్‌ను పొడిచాడు. మిత్రులు వినోద్‌ను కారులో తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. పోలీసులు నిందితుడు అక్షయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

  English summary
  In an ugly war among fans, a die hard fan of Power Star Pawan Kalyan named Vinod Royal died recently. Hearing the sad news Pawan Kalyan was deeply saddened and has decided to head for Tirupati today morning.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more