»   » ఎన్టీఆర్, అల్లు అర్జున్ సొంత కుంపటి.. బాబాయ్, మామయ్యల మాటెత్తరేంటి.. ఇక ఫ్యాన్స్ వారే..

ఎన్టీఆర్, అల్లు అర్జున్ సొంత కుంపటి.. బాబాయ్, మామయ్యల మాటెత్తరేంటి.. ఇక ఫ్యాన్స్ వారే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో నటుల మధ్య వ్యక్తిగత విభేదాల కారణంగా అభిమానుల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొంటున్నది. ఒక హీరో సినిమా వస్తుందంటే చాలూ మరో హీరో ఫ్యాన్స్ దుష్ప్రచారం సాగించడం పలు వివాదాలకు దారి తీస్తున్నది. తొలి ఆట ముగియక ముందే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, లేదా థియేటర్ బయట ప్రతికూలంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసి సినిమాపై ప్రభావం చూపేలా ప్రవర్తిస్తున్నారు. ఈ రకమైన తంతు ఇటీవల కాలంలో నందమూరి, మెగా ఫ్యాన్స్ అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తున్నది. రాజకీయ పరంగానూ, నటన పరంగానూ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఇలాంటి ఘర్షణ వాతావరణం ఎక్కువగా కనిపిస్తున్నది.

బాలయ్య, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్..

బాలయ్య, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్..

నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ల మధ్య గతకొద్దికాలంగా ప్రచ్ఛన్న యుద్ధమే జరుగున్నది. గతేడాది సంక్రాంతి బరిలో డిటెక్టర్‌తో బాలకృష్ణ, నాన్నకు ప్రేమతో చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బరిలోకి దిగారు. రెండు చిత్రాలు యావరేజ్ అని ఫ్లాప్ టాక్ సంపాదించుకున్నప్పటికి.. బాబాయ్‌పై అబ్బాయ్ కలెక్షన్ల పరంగా పైచేయి సాధించాడు. నాన్నకు ప్రేమతో సినిమా కలెక్షన్లు భారీగా రావడం బాలయ్య అభిమానులను అసంతృప్తికి కారణమైంది.

జూనియర్‌కు వ్యతిరేకంగా..

జూనియర్‌కు వ్యతిరేకంగా..

ఇలాంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ విడుదలైన సమయంలో బాలయ్య అభిమానులకు పట్టు ఉన్న జిల్లాలో ఆ చిత్రానికి వ్యతిరేకంగా పనిచేశారనే వాదన బలంగా వినిపించింది. జనతా గ్యారేజ్ సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి టీడీపీ శ్రేణులను పురమాయించారనే విమర్శలు కూడా వచ్చాయి. జనతా గ్యారేజ్ సినిమా భారీ కలెక్షన్లు సాధించడాన్ని ఎవరూ ఆపలేకపోయారు.

బాబాయ్ మాట ఎత్తడం మానేసిన..

బాబాయ్ మాట ఎత్తడం మానేసిన..

రాజకీయ కారణాల వల్ల తెలుగు దేశం పార్టీకి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ.. బాలకృష్ణకు దూరంగా ఉండటం స్పష్టంగా కనిపిస్తున్నది. కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు పార్టీకి అంటిముట్టనట్టు ఉంటున్న సంగతి తెలిసిందే. గతంలో పలు సినీ కార్యక్రమాల్లో బాబాయ్ గురించి, తాత గురించి ఎక్కువగా చెప్పే ఎన్టీఆర్ నోట ప్రస్తుతం ఆ మాటలు వినిపించడం లేదు. అడపాదడపా తాత ఎన్టీఆర్ గురించి చెప్పినా.. బాలకృష్ణ మాట ఎత్తడం పూర్తిగానే మానేశాడు.

బాబాయ్‌తో అబ్బాయ్ వార్

బాబాయ్‌తో అబ్బాయ్ వార్

ఇక మరోసారి బాబాయ్ బాలకృష్ణపై యుద్ధం ప్రకటించేశాడు అబ్బాయి జూనియర్. వాస్తవానికి మూహుర్తం రోజునే పైసా వసూల్ డేట్‌ను దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రకటించేశాడు. సెప్టెంబర్ 29న రిలీజ్‌కు ప్లాన్ చేస్తూ షూటింగ్‌ను పూర్తి చేస్తున్నాడు. కానీ హఠాత్తుగా జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ చిత్ర విడుదలను సెప్టెంబర్ 21న ప్రకటించి ఫ్యాన్స్ మధ్య వార్‌కు మరోసారి తెరతీశాడు.

మెగా ఫ్యామిలీలోనూ అదే తీరు..

మెగా ఫ్యామిలీలోనూ అదే తీరు..

ఇక మెగా ఫ్యామిలీ కథ మరో విధంగా ఉంది. టాలీవుడ్‌లో ఐక్యమత్యంగా కనిపించిన మెగా ఫ్యామిలీలో ప్రజారాజ్యం చిచ్చుపెట్టింది. వ్యక్తిగత అభిప్రాయాల కారణంగా మెగా కుటుంబానికి పవన్ కల్యాణ్ దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయినా తమ సినిమాలకు సంబంధించిన వేడుకల్లో పవన్ తప్ప మిగితా వారందరూ కనిపించేవారు. ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌పై అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మరోసారి మెగా ఫ్యామిలీపై ప్రభావం చూపాయి.

మావయ్య మాట వినిపించడం..

మావయ్య మాట వినిపించడం..

ఇటీవల కాలంలో అల్లు అర్జున్ సినిమా కార్యక్రమాల్లో ఏ మెగా హీరో కూడా కనిపించడం లేదు. గతంలో ప్రతీ కార్యక్రమంలో మామయ్యలు మెగాస్టార్, పవర్ స్టార్‌ను ఆకాశానికి ఎత్తే అల్లు అర్జున్ ఈ మధ్య చిరంజీవి, పవన్ కల్యాణ్ పేరు ఎత్తడంలో ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. సందర్భోచితంగా తప్పితే.. గతంలో మాదిరిగా చిరంజీవి పేరు ప్రస్తావించడం లేదు. మెగా ఫ్యాన్స్ అనే షాడో నుంచి సొంత కుంపటిని, బలగాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. డీజే సినిమాలో తొలిసారి మా తాత అలా చెప్పాడంటూ తన కుటుంబ వారసత్వాన్ని గుర్తు చేయడం చర్చనీయాంశమైంది.

దువ్వాడపై మెగా ఫ్యాన్ వార్

దువ్వాడపై మెగా ఫ్యాన్ వార్

అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా రిలీజ్ సందర్భంగా పవన్, స్టైలిష్ స్టార్ అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణం బాగానే కనిపించింది. సినిమా తొలి ఆట ముగియకముందే సినిమా యావరేజ్‌గా లేదని, రొటీన్‌గా ఉందనే స్టేట్‌మెంట్లు సోషల్ మీడియాలో స్వైర విహారం చేశాయి. దాంతో డీజే యూనిట్‌ ఓ దశలో కంగారు పడినంత పనైంది. సాయంత్రాని కల్లా సినిమాపై సానుకూలమైన టాక్ రావడంతో ఊపిరిపీల్చుకొన్నారు.

మరో హీరో సినిమా ఫ్లాప్ కావాలని..

మరో హీరో సినిమా ఫ్లాప్ కావాలని..

డీజే సక్సెస్ తర్వాత థ్యాంక్యూ మీట్ నిర్వహించిన సమయంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ఓ హీరో సినిమాను మరో హీరో ఫ్యాన్స్ ఫ్లాప్ కావాలని కోరుకోవద్దు. దాంతో పరిశ్రమ దెబ్బ తినే ప్రమాదం ఉంది. ప్రతీ హీరో సినిమా కూడా ఆడాలని కోరుకోవాలి. అప్పుడే టాలీవుడ్ బలోపేతం అవుతుంది అని అన్నారు. ఇదే కార్యక్రమంలో దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. గతంలో కూడా ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉండేవని.. అవి కేవలం తాత్కాలికం మాత్రమే. కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలోకి నువ్వెంతో.. నేనంతో తేల్చుకుందాం అనే స్థితి కనిపిస్తున్నది అని ఆవేదన వ్యక్తం చేశాడు. నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్య ఏ స్థాయికి చేరుతుందో అనే అంశపై సినీవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

English summary
Fan War reached to peak stage in Nandamoori and Mega Family. Differences between Balakrishna, NTR, and Allu Arjun, Pawan Kalyan become hot topic in the industry. This routed to Fan members are fighting in social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu