»   » నాన్నకు ప్రేమతో 25 డేస్ సంబరాలకు సిద్దం (ఫోటోలు)

నాన్నకు ప్రేమతో 25 డేస్ సంబరాలకు సిద్దం (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్), రకుల్ ప్రీతిసింగ్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కి విడుదలైన నాన్నకు ప్రేమతో బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో 25 రోజుల వేడుకలు నిర్వహించడానికి అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా పలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు. ఇదే వారంలో 25 డేస్ పూర్తి చేసుకోనున్న నాన్నకు ప్రేమతో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.


బెంగళూరు నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా విడుదల సందర్బంగా పండగ చేసుకున్నారు. నాన్నకు ప్రేమతో టైటిల్ తో ప్రత్యేకంగా టీ -షర్టులు, కీ చైన్ లు, బుక్ లు ముద్రించారు.


రిలీజ్ రోజు పండగే

రిలీజ్ రోజు పండగే

లాల్ బాగ్ సమీపంలోని ఊర్వశి చిత్ర మందిరంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకున్నారు.ప్రత్యేక టీ-షర్టులు

ప్రత్యేక టీ-షర్టులు

నాన్నకు ప్రేమతో టైటిల్ తో ప్రత్యేకంగా తయారు చేయించిన టీ -షర్టులు వేసుకున్న ఎన్టీఆర్ అభిమానులుపూలమాలలతో

పూలమాలలతో

ఊర్వశి థియేటర్ దగ్గర పూల మాలలతో అభిమానులు.టీ-షర్టులు విడుదల

టీ-షర్టులు విడుదల

అభిమానులు ప్రత్యేకంగా తయారు చేయించిన నాన్నకు ప్రేమతో టీ-షర్టులను విడుదల చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్.అభిమాన హీరోతో అభిమానులు

అభిమాన హీరోతో అభిమానులు

తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో బెంగళూరు నందమూరి అభిమానులు.థియేటర్ పై భాగంలో

థియేటర్ పై భాగంలో

ఊర్విశి చిత్రమందిరం పైభాగంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులుఅభిమాన సంఘం నాయకులు

అభిమాన సంఘం నాయకులు

బెంగళూరు నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ అభిమాన సంఘం నాయకులు అనూష సీవీ, గుణశేఖర్, గోపాల్, మురళి, రాజేష్, అశ్విని, నాగరాజ్, మంజు, మనోజ్, కార్తిక్ తదితరులు.


ఇలానే 25 డేస్ సంబరాలు (వీడియో)

నాన్నకు ప్రేమతో సినిమా విడుదల సందర్బంగా ఇలా సంబరాలు చేసుకున్నారు. 25 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా ఇదే విధంగా సంబరాలు చేసుకుంటామని అభిమానులు అంటున్నారు.


English summary
Fans celebrating Jr NTR Nannaku Prematho Movie Release in Bengaluru in Karnataka.
Please Wait while comments are loading...