»   » రచ్చ మొదలు పెట్టిన రవితేజ అభిమానులు... శవయాత్ర, శ్రద్ధాంజలి!

రచ్చ మొదలు పెట్టిన రవితేజ అభిమానులు... శవయాత్ర, శ్రద్ధాంజలి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేది నిన్నటి మాట. కత్తి మహేష్ వర్సెస్ రవితేజ ఫ్యాన్స్ అనేది నేటి వివాదం. అవును... ఇటీవల విడుదలైన రవితేజ 'టచ్ చేసి చూడు' సినిమాను టచ్ చేయకపోతేనే బెటర్ అని మహేష్ కత్తి రివ్యూ చెప్పడంతో రవితేజ అభిమానులు రెచ్చిపోయారు. మహేష్ కత్తికి ఆన్ లైన్లో శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు అతడికి శవయాత్ర నిర్వహించినట్లు ఫోటోలు క్రియేట్ చేసి ట్రోల్ చేస్తున్నారు.

కొత్తదనం కోసం చూస్తే దెబ్బే... అందుకే ఆ సినిమాలు ఫ్లాప్ !
ఫ్యాన్స్ ఇంతగా ఎందుకు రియాక్ట్ అవుతారో అర్థం కావడం లేదు: మహేష్ కత్తి

ఫ్యాన్స్ ఇంతగా ఎందుకు రియాక్ట్ అవుతారో అర్థం కావడం లేదు: మహేష్ కత్తి

రవితేజ అభిమానులు అలా చేయడంపై మహేష్ కత్తి ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో స్పందిస్తూ... ఒక సినిమా అంటే హీరో కాదు, సినిమా సినిమానే. హీరో అనే వ్యక్తి ఒక పాత్ర మాత్రమే వేస్తాడు. ఆ పాత్రకు తగిన కథ ఉందా లేదా? డైరెక్షన్ సరిగా చేశాడా లేదా? ఇతర టెక్నికల్ అంశాల గురించి ఓవరాల్‌గా విశ్లేషించడమే సినిమా రివ్యూ అని తెలిపారు.

అనాల్సింది నన్ను కాదు, మీ హీరోనే!

అనాల్సింది నన్ను కాదు, మీ హీరోనే!

ఒక సినిమా ప్లాప్ అయిందంటే కారణం కథే. అలాంటి కథ ఎన్నుకుంటాడు కాబట్టి దానికి బాధ్యత కూడా హీరోనే వహించాల్సి ఉంటుంది. సినిమా బాగోలేకుంటే రివ్యూవర్ బాగా లేదనే చెబుతాడు. ఇక్కడ అభిమానులు అనాల్సింది నన్ను కాదు... అలాంటి కథ ఎన్నుకున్న హీరోనే అని కత్తి మహేష్ తెలిపారు.

సినిమా అంటే అవగాహన లేదు

సినిమా అంటే అవగాహన లేదు

కొందరు అభిమానులు సినిమా అంటే ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడతారు. సినిమా అంటే కేవలం హీరో అనే అపోహలో ఉండిపోతారు. అలాంటి వారు ఇలానే ప్రవర్తిస్తారు, వీరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అందుకే నేను వారిని పట్టించుకోను అని మహేష్ కత్తి అన్నారు.

ఇది నా అభిప్రాయం మాత్రమే

ఇది నా అభిప్రాయం మాత్రమే

రివ్యూ అనేది కేవలం నా అభిప్రాయం మాత్రమే. సినిమా చూసిన తర్వాత నా అనుభూతిని చెబుతాను. ఒక వేళ సినిమా బావుంటే నేను చూడొద్దని చెప్పినా పెద్ద హిట్టఅవుతుంది. మంచి సినిమా విజయాన్ని ఎవరూ ఆపలేరు అని మహేష్ కత్తి తెలిపారు.

వారిలో సినీ విమర్శకుడు ఒకడు

వారిలో సినీ విమర్శకుడు ఒకడు

సినిమా చూసిన తర్వాత థియేటర్ వద్ద వంద మంది వంద అభిప్రాయాలు చెబుతారు. ఆ వంద మందికి వంద అభిప్రాయాలు ఉన్నట్లే సినీ విమర్శకుడిది కూడా సినిమాపై ఒక అభిప్రాయం మాత్రమే అని మహేష్ కత్తి తెలిపారు.

ప్రేక్షకుడు గుడ్డిగా ఫాలో అవ్వడం లేదు

ప్రేక్షకుడు గుడ్డిగా ఫాలో అవ్వడం లేదు

ప్రేక్షకుడు గుడ్డిగా సినిమా రివ్యూలను ఫాలో అవుతున్నాడు అనే వాదనలో నిజం లేదు. మేము రివ్యూలు రాస్తే..... వాటిని చదివి ప్రేక్షకుడు సినిమా చూస్తాడు. సినిమా చూసిన తర్వాత వారి అభిప్రాయాలకు, మా రివ్యూలు మ్యాచ్ అయితేనే వారు నెక్ట్స్ మా రివ్యూలు చదువుతారు. మ్యాచ్ కాక పోతే మా రివ్యూలు చదవడం మానేసి అతడి మైండ్ సెట్‌కి సూటయ్యే మరో రివ్యూవర్‌ను ఎంచుకుంటారు అని మహేష్ కత్తి తెలిపారు.

రివ్యూలు బాక్సాఫీసు ఫేట్ డిసైడ్ చేయవు

రివ్యూలు బాక్సాఫీసు ఫేట్ డిసైడ్ చేయవు

మేము ఇచ్చే రివ్యూలు.... సినిమా ఫేట్‌ను, బాక్సాఫీసు కలెక్షన్లను మార్చలేవు. ప్రేక్షకుడికి నచ్చితే సినిమా చూస్తాడు. ఒక వేళ సినిమా బావుంటే మా రివ్యూలు నెగెటివ్ గా ఉన్నా సినిమా విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అదే సమయంలో దమ్ములేని సినిమాలను విజయ పథంలో నడిపంచనూ లేవు అని మహేష్ కత్తి తెలిపారు. రాజా ది గ్రేట్ చిత్రం బావుందని రివ్యూ చెప్పాము... అది వాస్తవం కాబట్టే సినిమా హిట్టయిందని మహేష్ కత్తి తెలిపారు.

English summary
"Fans must not over react to reviews, Reviews do not impact a film's box office fate" Mahesh Kathi said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu