»   » పోట్లాటకు రెడీ అయిన బాలయ్య, నాగార్జున అభిమానులు

పోట్లాటకు రెడీ అయిన బాలయ్య, నాగార్జున అభిమానులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తిరుపతి: డిక్టేటర్, సోగ్గాడే చిన్న నాయన చిత్రాల విడుదల నేపథ్యంలో బాలకృష్ణ, నాగార్జున అభిమానులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. పోట్టాటకు కూడా సిద్ధపడ్డారు. తిరుపతిలోని గ్రూప్ థీయేటర్స్‌లో ప్రక్క ప్రక్కనే ఈ సినిమాలు ఆడుతున్నాయి.

తమ హీరో సినిమా బాగుందంటే తమ హీరో సినిమా బాగుందంటూ బాలకృష్ణ, నాగార్జున అబిమానులు కొట్లాటకు దిగార. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, అక్కడున్న కొందురు ఇరువురికి నచ్చ చెప్పి గొడవ సద్దుమణిగేలా చేసారు.

Fans of Nagarjuna and Balalyya clash at Tirupathi

టాలీవుడ్ టాప్ హీరోలుగా ఉన్న బాలయ్య , నాగార్జున సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధిస్తున్నాయి. బాలయ్య నటించిన డిక్టేటర్ చిత్రం మాస్ మూవీగా తెరకెక్కగా, నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా మూవీ ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకులను మరింత అలరిస్తోంది.

డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలు రెండు అభిమానులను ఆకట్టుకుంటుండగా , ఈ చిత్రాలకు ప్రేక్షకాదరణ మరింత పెరిగింది. మంచి కథ దొరికితే బాలయ్యతో మల్టీ స్టారర్ చేస్తానని ఇటీవల నాగార్జున చెప్పగా, ఈ సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం కొందరిని భాదిస్తోంది.

English summary
Fans of Nagarjuna and Balakrishna clashed at tirupathi.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu