»   » మరీ రొమాంటిక్ గా ఉంది బాబూ..! సన్నాఫ్ లేడీస్ టైలర్ ఫస్ట్ లుక్

మరీ రొమాంటిక్ గా ఉంది బాబూ..! సన్నాఫ్ లేడీస్ టైలర్ ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వంశీ 'లేడీస్ టైలర్' మళ్లీ వస్తున్నాడు. అయితే ఇప్పుడు సరికొత్త ఫ్యాషన్ టెక్నిక్స్ తో.. మగువల అందాలను మరింత పెంచే టైలర్ గా వస్తున్నాడు. సన్నాఫ్ లేడీస్ టైలర్ గా.. ఫ్యాషన్ డిజైనర్ గా అలరించనున్నాడు. వంశీ లేడీస్ టైలర్ విడుదలై 30 ఏళ్లవుతోంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిదే.

లేడీస్ టైలర్

లేడీస్ టైలర్

కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్, సీనియర్ దర్శకుడు వంశీ కాంబినేషన్ లో వచ్చిన ‘లేడీస్ టైలర్' చిత్రం ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడు వంశీ కెరియర్లో బిగ్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం, హీరోగా రాజేంద్ర ప్రసాద్ కెరియర్ ని మలుపు తిప్పింది.

సన్నాఫ్ లేడీస్ టైలర్

సన్నాఫ్ లేడీస్ టైలర్

ఈ చిత్ర సీక్వెల్ కి ‘ఫ్యాషన్ డిజైనర్' (సన్నాఫ్ లేడీస్ టైలర్) అనే ట్యాగ్ లైన్ తో సినిమాను తెరకెక్కించాడు వంశీ. సుమంత్ అశ్విన్ హీరోగా లేడీస్ టైలర్ సీక్వెల్ తెరకెక్కించిన వంశీ ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ తో కూడా ఓ ముఖ్య పాత్ర చేయించినట్టు తెలుస్తుంది.

లేడీస్ టైలర్ సీక్వెల్

లేడీస్ టైలర్ సీక్వెల్

ఈ చిత్రాన్ని మాస్ మహారాజ్ రవితేజతో లేదంటే యంగ్ హీరో రాజ్ తరుణ్ తో చేయాలని వంశీ భావించాడు. కాని ఫైనల్ గా సుమంత్ అశ్విన్ హీరోగా లేడీస్ టైలర్ సీక్వెల్ తెరకెక్కించారు. కొన్ని నెలుగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ కోనసీమ పరిసర ప్రాంతాల్లోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ మూవీలో ముఖ్య పాత్ర చేయనున్నాడని ఫిలింనగర్ టాక్.

మధుర శ్రీధర్

మధుర శ్రీధర్

రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మధుర శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో అనీషా అంబ్రోస్, ఈషా, మానస కథానాయికలుగా కనిపించనున్నారు.అందుకు సంబంధించి ప్రీ లుక్ ను విడుదల చేశారు దర్శకుడు వంశీ. ఈ ప్రీ లుక్ చూడగానే జతొజడ మీద జమజచ్చ అంటూ తండ్రి ఎక్కడెక్కడో వెతికితే ఇప్పుడు ఈ కొడుకు మరేం వెతకనున్నాడో అనిపించక మానదు.

తొడమీద పుట్టుమచ్చ

తొడమీద పుట్టుమచ్చ

అయితే వంశీలో ఉన్న ఒక ప్రత్యేకథ ఏమిటంటే లేడీస్ టైలర్లో రాజేంద్ర ప్రసాద్ అంత తొడమీద పుట్టుమచ్చకోసం వెతికినా నవ్వుతప్ప అసభ్యంగా అనిపించదు ఇప్పుడు కూడా వంశీ తనమార్కు శృంగారాన్నే కలిపి ఈ సినిమానీ తెరకెక్కించాడన్నది తెలిసిపోతూనే ఉంటది కాకుంటే చిన్న రొమాంటిక్ మెరుపు ఈ ప్రీ లుక్ పై ఒక లుక్కేయండీ....

English summary
Pre-Look poster of Fashion Designer S/O Ladies Tailor has been released and its first look to be out shortly. This film is the latest sequel to classic Ladies Tailor which featured Rajendra Prasad in lead is all set to begin its production shortly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu