»   » కాజల్ కు అవార్డు, సినిమాలు లేని టైమ్ లో కాస్త ఊరడింపే మరి

కాజల్ కు అవార్డు, సినిమాలు లేని టైమ్ లో కాస్త ఊరడింపే మరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: ఫెమినా పవర్ లిస్ట్ సౌత్ 2016 అవార్డులు వాటిక కోకోనట్ ఆయిల్, రాజ్ డైమండ్స్ వారి అశోశియోషన్ తో బెంగుళూరులో జరిగింది. తెలుగు,తమిళ భాషల్లో హీరోయిన్ గా చేస్తున్న కాజల్ ఈ అవార్డ్ కు ఎంపికైంది. ఈ అవార్డ్ ని ఆమె బెంగుళూరు వెళ్లి తీసుకుంది.

ఈ అవార్డ్ లను వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనపరిచిన వారికి ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా లిటరేచర్, సినిమా, కార్పోరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ, ఫారిన్ సర్వీస్, ధియోటర్, ఫ్యాషన్, స్పోర్ట్స్, సోషల్ ఏక్టివిజం వంటి రంగాలను నుంచి ఎంపిక చేసిన వారుకి ఈ అవార్డ్ లు అందచేసారు.

ఈ సంవత్సరం ఫెమినా పవర్ లిస్ట్ సౌత్ 2016లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్శన్ సుధామూర్తి, ధియోటర్ వెటరన్ అరుంధతి నాగ్, పార్మర్ ఫారిన్ సెక్రటరీ నిరుపమరావు, నటి కాజల్ అగర్వాల్, ఫ్యాషన్ డిజైనర్ దిపికా గోవింద్, ప్రొడ్యూసర్ ఆల్ఫా హిప్పటోల, కవియిత్రి అర్జున్ హాసన్, బెంగుళూరు ఐకానిక్ రెస్టారెంట్ ఎమ్ టి ఆర్ మేనేజింగ్ పార్టనర్ హేమమాలిని మాల్య , ఏక్టవిస్ట్ కుట్టి రేవతి వంటి వారు ఉన్నారు.

కాజల్ మాట్లాడుతూ.... "నేను ఈ అవార్డ్ కు ఎంపిక కావటం గౌరవంగా భావిస్తున్నాను. ముఖ్యంగా వేరు వేరు రంగాల్లో పేరొందిన మరికొందరు మహిళలు సరసన నిలబడి ఈ అవార్డ్ అందుకోవటం అన్నిటికన్నా గొప్ప విషయం. విజయం సాధించిన స్త్రీల సరసన నిలబడి వారిలో నేను ఒకరిని కావటం ఆనందమే కదా ." అంటూ చెప్పుకొచ్చింది.

కాజల్ ఫొటోలు క్రింద చూడండి...

తెలుగులో

తెలుగులో

హిట్ లు, సినిమాలు లేకపోయినా సీనియర్ హీరోయిన్ అనే ముద్రతో కొట్టుకోపోతంది కాజల్.

మూడు ఫ్లాఫులు

మూడు ఫ్లాఫులు

వరసపెట్టి మూడు ఫ్లాఫ్ లు పలకరించినా ఈమె డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు.

చిరంజీవి కోసం

చిరంజీవి కోసం

రీసెంట్ గా ఆమెను చిరంజీవి సినిమాలో సైతం అడిగి కాదనిపించుకున్నారు.

డిమాండ్ చేసింది

డిమాండ్ చేసింది

తన కెరీర్‌లో ఎన్నడు లేని విధంగా చిరు సినిమాకు కాజల్ 2.5 కోట్లు పారితోషికం డిమాండ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

వద్దనుకున్నారు

వద్దనుకున్నారు

అయితే ఇంత మొత్తాన్ని ఇచ్చేందుకు నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించకపోగా, మరో హీరోయిన్‌ని సెలక్ట్ చేసే పనిలో ఉండారు. ఈ సినిమాకి ఖైదీ నెంబర్ 150 అనే టైటిల్ పరిశీలిస్తోండగా సంక్రాంతి కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయాలని నిర్మాత రామ్ చరణ్ భావిస్తున్నాడు.

అతి పెద్ద డిజాస్టర్స్

అతి పెద్ద డిజాస్టర్స్

కాజల్ కు మైనస్ అవటానికి కారణం..తెలుగు లో రీసెంట్ గా వచ్చిన రెండు చిత్రాలు వాటిల్లో ఒకటి పవన్ కళ్యాణ్ "సర్దార్ గబ్బర్ సింగ్", అయితే మరొకటి మహేష్ బాబు "బ్రహ్మోత్సవం". రెండు చిత్రాలు యావరేజ్ కూడా కాకుండా పూర్తిగా డిజాస్టర్స్ అయ్యాయి.

తమిళ చిత్రం కూడా..

తమిళ చిత్రం కూడా..

ఇక ఈమె నటించిన తమిళ సినిమా "ఇంజి ఇదిపాజ్హాగి" కూడా అక్కడ అంతంత మాత్రంగానే ఆడింది.

తమిళంవైపే చూపు

తమిళంవైపే చూపు

తెలుగులో ఆఫర్స్ లేకపోవడంతో కాజల్ తమిళ్ ఇండస్ట్రీని ఫోకస్ చేస్తూ అక్కడి అవకాశాలు చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది

అక్కడా అదే పరిస్దితి

అక్కడా అదే పరిస్దితి

బాలీవుడ్ లో మాత్రం బ్లైండ్ గర్ల్ గా నటించిన మూవీ "దో లఫ్జోన్ కి కహాని" అక్కడ మంచి హైప్ క్రియేట్ చేసుకొంది. కనీసం ఈ సినిమా అయిన కాజల్ కి ఊరట ఇస్తుంది అనుకుంటే అదీ డిజాస్టర్ అయ్యింది.

పదేళ్లు దాటింది

పదేళ్లు దాటింది

కాజల్ ఈ గ్లామర్ ఇండస్ట్రీ లోకి వచ్చి పదేళ్ళు దగ్గర పడుతోంది రోజు రోజు కీ కాంపిటీషన్ పెరిగి పోతున్న ఈ రంగం లో కాజల్ లో మునుపటి గ్లో కూడా పోయిన నేపథ్యంలో ఆమె ఇంకెంతో కాలం హీరోయిన్ గా కొనసాగకపోవచ్చేమో... అనుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

సమంత కొట్టుకుపోతోంది

సమంత కొట్టుకుపోతోంది

తెలుగుకి వస్తే కాజల్ కి ఇప్పుడు సమంతా పెద్ద తలనొప్పిగా మారింది. మొన్నటివరకూ కాజల్ని తలకెత్తుకున్న వాళ్ళంతా సమంతా వెనక పడుతున్నారు. కాజల్ అవకాశాలని సమంతా అందుకుంటూ హ్యాపీగా ఉంది.

స్పెషల్ సాంగ్

స్పెషల్ సాంగ్

'ధ్రువ' సినిమాలో. ...చరణ్ తో కలిసి ఒక స్పెషల్ సాంగ్ లో చిందులేయనుందట కాజల్ అగర్వాల్. ఇదైనా నిజమవుతుందో లేదో చూడాలి.

English summary
Kajal Aggarwal, has made it to the Femina Power List South 2016. The actress says "it feels immensely gratifying" to find a spot in the list of women achievers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu