సర్వీస్ టాక్సుకు వ్యతిరేకిస్తూ సినీ పరిశ్రమ బంద్

By Bojja Kumar

కేంద్ర ప్రభుత్వం సినిమాలపై సర్వీస్ టాక్సును విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 23న దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమ బంద్ పాటించనుంది. ఈ మేరకు మంగళవారం సమావేశం అయిన తెలుగు సినీ నిర్మాతలు బంద్ ను బల పరుస్తూ సర్య్కూలర్ జారీ చేశఆరు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని భాషలకు చెందిన సినిమాల వారు ఈ బంద్ లో భాగస్వాములు కానున్నారు.

భారతీయ సినీ పరిశ్రమ ఇప్పటికే నష్టాల్లో నడుస్తోంది. సంవవత్సరంలో సగటున నిర్మించిన సినిమాలు, వాటికి పెట్టిన ఖర్చుతో పోలిస్తే...అసలు లాభాలు చాలా తక్కవుగా ఉంటున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో పరిస్థితి మరీ అద్వాన్నంగా ఉంది. ఈ తరుణంలో సర్వీస్ టాక్స్ విధిస్తే నిర్మాతలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి వెల్లడించారు. ఇప్పటికే సౌతిండియా ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ గవర్నమెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టును సంప్రదించాలని నిర్ణయించాయి. ఈ నిర్మాతల మండలి సమావేశానికి తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలు హాజరయ్యారు. ఈ మేరకు అందరూ సర్వీస్ టాక్స్ ను వ్యతిరేకిస్తూ బంద్ కు మద్దతు ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X