»   » పార్వతి మిల్టన్ ...'ఛీఫ్ మినిస్టర్ రాజన్న'

పార్వతి మిల్టన్ ...'ఛీఫ్ మినిస్టర్ రాజన్న'

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్వర్గీయ డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్రను ఆధారం చేసుకుని ఛీఫ్ మినిస్టర్ రాజన్న అనే చిత్ర రూపొందనుంది. గతంలో నేనే ముఖ్యమంత్రి నైతే అని చిత్రాన్ని నిర్మించి ఎలక్షన్ టైమ్ లో రిలీజ్ చేసిన ఎమ్.నరేంద్ర నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 1975లో ఆయన రాజకీయ కెరీర్ ప్రారంభం నుంచి హెలీకాఫ్టర్ కూలటం వరకూ జరిగిన ముఖ్యమైన సంఘటనలతో ఈ చిత్రం సాగుతుందంటున్నారు. దాదాపు వందమంది వరకూ కొత్త వారిని ఈ చిత్రంలో పరిచయం చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం భారీగా ఉన్నత సాంకేతిక విలువలతో తీయనున్నట్లు చెపుతున్నారు. సమీర రెడ్డి, పార్వతి మిల్టన్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా చేస్తున్ారు. సోనూసూద్,ప్రదీప్ రావత్, రాహుల్ దేవ్, ఆషిష్ విధ్యార్ధి, సునీల్ ముఖ్య తారాగణంగా కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని 250 ప్రింట్లతో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేగాక ఈ చిత్రంపై వచ్చే లాభాల్లో యాభై శాతం వరకూ పేదలకు పంచనున్నామని చెప్తున్నారు. ఇక మల్టి మీడియా ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ పై నిర్మించే ఈ చిత్రంలో నటించాలన్న ఆసక్తి ఉన్నవారు...స్వయంగా క్రింద ఎడ్రస్ కి ఫోటోలు పంపించవచ్చు అంటున్నాడు నిర్మాత,దర్శకత్వం ఎమ్.నరేంద్ర నాయుడు. ఆసక్తి ఉన్నవారకి ఎడ్రస్...
మల్టీ మీడియా ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్
ప్రొడక్షన్ నెంబర్ త్రి...ఛీప్ మినిస్టర్ రాజన్న
హౌస్ నెంబర్ 14బి, మాగంటి కాలనీ, రోడ్ నెంబర్ 7,
ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్-500033
సెల్ నెంబర్: 95537 67698

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu