twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిల్‌రాజు, రాధాకృష్ణకు బెదిరింపులు.. పైరసీ ముఠా గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్

    By Rajababu
    |

    కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మిస్తున్న సినిమాలు పైరసీ కోరల్లో చిక్కుకుపోతున్నాయి. విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ వెబ్‌సైట్లలో సినిమాలు ఆడేస్తుండటంతో నిర్మాతలు లబోదిబో మంటున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకొన్నాగానీ ఇటీవల వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలకు ఆ పైరసీ బెడద తప్పలేదు. ఇటీవల జవాన్ మూవీ చిత్రం దర్శకుడు బీవీఎస్ రవి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జవాన్ ఫైనాన్సర్‌ను బెదిరిస్తున్న ముగ్గురి పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

    సినిమా పైరసీ గుట్టురట్టు

    సినిమా పైరసీ గుట్టురట్టు

    పైరసీకి పాల్పడుతున్న ఓ బృందం గుట్టును బుధవారం పోలీసులు రట్టు చేశారు. వసూళ్లకు పాల్పడుతున్న పుట్టా సుధాకర్ చౌదరీ, పుట్టా ప్రభాకర్ చౌదరీ, విజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

    జవాన్ మూవీ పైరసీ

    జవాన్ మూవీ పైరసీ

    జవాన్ మూవీ పైరసీ కాకుండా ఆపుతామని జవాన్ ఫైనాన్సియర్‌ కృష్ణయ్యను ఓ ముగ్గురు సంప్రదింపులు జరిపారు. అంతేకాకుండా భారీగా డిమాండ్ చేసి బెదిరించారు.

    ఫైనాన్సియర్ ఫిర్యాదు

    ఫైనాన్సియర్ ఫిర్యాదు

    ఫైనాన్సియర్ కృష్ణయ ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. వారిని బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టుకు అప్పగించారు. 2012 నుంచి చాలా మంది ఫైనాన్సియర్ నుంచి నిందితలు డబ్బులు తీసుకొన్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు సమాచారం.

    పైరసీని అరికట్టండి.. దిల్ రాజు

    పైరసీని అరికట్టండి.. దిల్ రాజు

    ఇదిలా ఉండగా, పైరసీని అరికట్టాలని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌‌లో నిర్మాత దిల్ రాజు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ రఘువీర్‌కు ఆయన ఫిర్యాదును అందజేశారు.

    ఎంసీఏ చిత్రానికి పైరసీ ముప్పు

    ఎంసీఏ చిత్రానికి పైరసీ ముప్పు

    దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో నాని నటించిన ఎంసీఏ చిత్రం డిసెంబర్ 21 విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎంసీఏ సినిమా పైరసీని అరికట్టాలని ఆయన డీసీపీని కోరారు. దీనిపై స్పందించిన డీసీపీ.. ఎంసీఏ సినిమా పైరసీకి గురి కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని రాజుకు హామీ ఇచ్చినట్టు తెలిసింది.

    పైరసీ చేస్తామని బెదిరింపులు.. దిల్ రాజు

    పైరసీ చేస్తామని బెదిరింపులు.. దిల్ రాజు

    ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ఎంసీఏ సినిమాను విడుదలకు ముందే పైరసీ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారు. డబ్బుల కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతకుముందు జవాన్‌ సినిమా అప్పుడు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను అని దిల్‌ రాజు చెప్పారు.

    అజ్ఞాతవాసి నిర్మాత కూడా

    అజ్ఞాతవాసి నిర్మాత కూడా

    అలాగే బుధవారం రోజున ప్రముఖ నిర్మాత, అజ్ఞాతవాసి చిత్రాన్ని రూపొందించిన ఎస్ రాధాకృష్ణ కూడా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తమ చిత్రాన్ని పైరసీకి గురికాకుండా చూడాలని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

    1000 కోట్ల నష్టం

    1000 కోట్ల నష్టం

    పైరసీల వల్ల దాదాపు ఇండస్ట్రీకి ఏటా వెయ్యికోట్ల మేర నష్టం జరుగుతున్నది. ప్రభుత్వానికి దాదాపు వందకోట్ల ఆదాయానికి గండిపడింది అనేది సినీ ప్రముఖులు, విశ్లేషకుల అంచనా. అయితే దీనివల్ల చిన్న నిర్మాతలతోపాటు, పెద్ద నిర్మాతలు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

    English summary
    Film piracy rocket busted in Hyderabad on December 20th. Cyber Crime Police are caught three person, who is warning the producers for money. Apart from this, MCA, and Agyathavaasi movies set release in this season. In this occassion, Producer Dil Raju and S Radhakrishna lodged petition in Cyber Crime police stations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X