Don't Miss!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
మొగుడు కొట్టినందుకు కాదు.. కోడలు నవ్వినందుకు.. చంద్రబాబుపై థర్టీ ఇయర్స్ పృథ్వీ సెటైర్లు
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో సినీ నటుడు. ఆ పార్టీ నేత థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా పృథ్వీరాజ్ పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో మీడియాతో పృథ్వీరాజ్ మాట్లాడుతూ చంద్రబాబుపై ఆసక్తికరమైన కామెంట్ చేశారు. చంద్రబాబును ఉద్దేశించి పృథ్వీ ఏమన్నారంటే..

వైఎస్ జగన్ విజన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఆయనను ప్రజలకు చేరువగా చేసింది. రైతు అనుకూలం విధానాలపై తన విజన్ అందర్ని ఆకట్టుకొన్నది. ఆయన పాదయాత్ర చేపట్టినప్పుడే ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఆయనకు అధికారం అప్పగించాలని 18 నెలల క్రితమే నిర్ణయం తీసుకొన్నారు అని నటుడు పృథ్వీరాజ్ అన్నారు.

ఇది ప్రజా విజయం
రైతు రాజ్యం, ప్రజా రాజ్యం, మహిళల రాజ్యం, యువకులు రాజ్యం రావాలంటే వైఎస్ జగన్‌తోనే సాధ్యమని ప్రజలు నమ్మారు. అందరికి సంక్షేమం అందాలంటే జగన్ అధికారంలోకి రావాలని కోరుకొన్నారు. 150 ఎమ్మెల్యే సీట్లు, 24 పార్లమెంట్ సీట్లు కట్టబెట్టడాన్ని ప్రజా విజయంగా అభివర్ణించాలని పృథ్వీరాజ్ అభిప్రాయపడ్డారు.

చంద్రబాబుపై పృథ్వీ సెటైర్లు
ఈవీఎం టాంపరింగ్ కారణంగానే ఓటమి పాలయ్యామనే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను పృథ్వీరాజ్ తప్పుపట్టారు. ఆయన గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేశాయంటారు. ఓడిపోతే ఈవీఎంలను తప్పుపడుతారు. మొగుడు కొట్టినందుకు కాదు.. తోటి కోడలు నవ్వినందుకే అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉందని పృథ్వీ ఎద్దేవా చేశారు.

అందుకే సినీ నటుల మద్దతు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సినీనటులు మద్దతు తెలపడాన్ని పృథ్వీ సమర్థించారు. ఏపీ ప్రాంత అభివృద్ది జగన్‌తోనే సాధ్యమని భావించినందునే ఆయనకు మేమంతా మద్దతిచ్చాం. యువకుడు, పట్టుదల, మాటతప్పని వైఖరి ఉన్నందునే జగన్ వెంట నడిచాం. కేవలం సినీ నటులే కాదు.. రాష్ట్ర ప్రజలందరూ ఆయనకు మద్దతు తెలపడం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది అని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.