»   » కన్నడలో జూనియర్ ఎన్టీఆర్‌ తడాఖా.. జై లవకుశ ఫస్ట్‌లుక్

కన్నడలో జూనియర్ ఎన్టీఆర్‌ తడాఖా.. జై లవకుశ ఫస్ట్‌లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కన్నడలో గతేడాది విడుదలైన హీరో పునీత్ రాజ్‌కుమార్ సినిమా 'చక్రవ్యూహ'చిత్రంలో ఓ పాటపడాడు. ఆ సినిమాలో తారక్ 'గెలాయ గెలాయ' సాంగ్‌ను ఆలపించాడు. ఎన్టీఆర్ పాడిన పాటను ప్రేక్షకులు ఆదరించారు. తారక్‌ను సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఏడాది చార్ట్ బస్టర్లలో ఎన్టీఆర్ పాడిన పాట టాప్‌ స్ఠానాన్ని దక్కించుకొన్నది. తారక్‌కు అవార్డు వస్తుందా..? రాదా..? అన్నది పక్కనపెడితే.. సింగర్ కేటగిరీలో అవార్డుకు నామినేట్ అవ్వడం మాత్రం శుభపరిణామమే. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మే 19వ తేదీ ఎన్టీఆర్ జన్మదినం. ఆ సందర్భంగా ఆయన నటిస్తున్న జైలవకుశకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల చేస్తున్నారు.

ఫిలింఫేర్ అవార్డుకు..

జూనియర్ ఎన్టీఆర్‌కు అవార్డు వచ్చిన విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ రోజు మీకు అద్భుతమైన వార్తను అందిస్తున్నాను. జూనియర్ ఎన్టీఆర్ పాడిన పాట గెలయా గెలాయా ఫిలింఫేర్ అవార్డుకు ఎంపికైంది అని తమన్ ట్వీట్ చేశాడు.

ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా..

ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా..

ఇదిలా ఉండగా, ప్రస్తుతం తారక్ నటిస్తున్న జై లవకుశ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మే 19 (శుక్రవారం) మధ్యాహ్నం 3.15 నిమిషాలకు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు.

తమన్ ఆసక్తికరమైన ట్వీట్..

ఈ సినిమా ఫస్ట్ లుక్ గురించి తమన్ గురువారం ట్వీట్ చేశాడు. జైలవకుశ చిత్రం ఎన్టీఆర్ జీవితంలోనే అతిపెద్ద హిట్‌గా నిలుస్తుంది. ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను అని తమన్ ట్వీట్ చేశారు.

విలన్ పాత్ర కోసం..

విలన్ పాత్ర కోసం..

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్‌వెల్ పనిచేస్తున్నారు. ఈయన గతంలో లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్, షటర్ ఐలాండ్ చిత్రాలకు పనిచేశారు. ఈ చిత్రంలో విలన్ ఛాయలున్న పాత్రను వాన్స్ ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పాత్రకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయిన సంగతి తెలిసిందే.

English summary
Telugu superstar Jr NTR's Jai Lava Kusa is one of the highly expected releases this year. On the auspicious day of Rama Navami last month, the makers unveiled Jai Lava Kusa's official logo, which went viral on the internet. While the shooting of the film is progressing at a brisk pace, Jr NTR's look for the film will released on May 19, on the eve of Jr NTR's birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu