twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Filmfare Awards 2019: రామ్ చరణ్, రష్మిక మందన్న, అనసూయ.. టాలీవుడ్ నుంచి ఇంకా..

    |

    సినీ ఇండస్ట్రీలో ఇండ‌స్ట్రీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన నటీనటులను మరింత ఎంకరేజ్ చేసేలా ప్రతీ ఏడాది ఫిలింఫేర్ అవార్డ్స్ ఇవ్వబడుతున్నాయి. ఈ నేపథ్యంలో 66వ సౌత్‌ ఇండియన్ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల కార్యక్రమం డిసెంబ‌ర్ 21న నెహ్రూ ఇండోర్ స్టేడియం చెన్నైలో ఘనంగా జ‌రిగింది. ఈ కార్యక్రమానికి సందీప్ కిషన్, రెజీనా హోస్టులుగా వ్యవహరించడం విశేషం. కార్యక్రమ సంగతులు, అవార్డుల వివరాలపై ఓ లుక్కేద్దామా..

    సౌత్ ఇండియన్ నాలుగు భాషల్లోని తారలు.. సందడే సందడి

    సౌత్ ఇండియన్ నాలుగు భాషల్లోని తారలు.. సందడే సందడి

    ఈ ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమానికి టాలీవుడ్, కోలీవుడ్, కన్నడ, మల‌యాళ పరిశ్రమలకు చెందిన నటీనటులు పెద్దఎత్తున హాజ‌ర‌య్యారు. తార‌ల సంద‌డితో సభా ప్రాంగ‌ణం అంతా కోలాహాలంగా కనిపించింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లోని విన్నర్స్‌కి ఈ అవార్డులకు అందజేశారు.

    టాలీవుడ్ విషయానికొస్తే..

    టాలీవుడ్ విషయానికొస్తే..

    టాలీవుడ్ చిత్రసీమ విషయానికొస్తే 2019 సంవత్సరానికి గాను 66వ ఫిలింఫేర్ అవార్డుల్లో రంగస్థలం, మహానటి సినిమాలకు అవార్డుల పంట పండింది. బెస్ట్ యాక్టర్‌గా కూడా రామ్ చరణ్ ఎంపిక కాగా, ఉత్తమ నటిగా కీర్తి సురేష్ ఎంపికైంది.

    ఉత్తమ చిత్రం మహానటి

    ఉత్తమ చిత్రం మహానటి

    ఉత్తమ చిత్రంగా మహానటి సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది. కీర్తి సురేష్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సావిత్రి జీవిత కథను కళ్ళకు కట్టినట్లు చూపించారు.

    ఉత్తమ నటుడు రామ్ చరణ్

    ఉత్తమ నటుడు రామ్ చరణ్

    మెగా వారసుడు రామ్ చరణ్‌ని లీడింగ్ రోల్ బెస్ట్ యాక్టర్ (మేల్) అవార్డు వరించింది. ఆయన కెరీర్‌‌లో ఉత్తమ చిత్రంగా కీర్తించబడుతున్న రంగస్థలం సినిమాలో నటనకు గాను ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడిగా ఈ అవార్డు అందుకున్నాడు రామ్ చరణ్.

    ఉత్తమ నటి కీర్తి సురేష్

    ఉత్తమ నటి కీర్తి సురేష్

    'మహానటి' సినిమాకు గాను ఇటీవలే ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ మళ్ళీ ఇప్పుడు ఫిల్మ్‌ఫేర్ కూడా సొంతం చేసుకుంది. లీడింగ్ రోల్ బెస్ట్ యాక్టర్ (ఫీమేల్) అవార్డు ఆమెను వరించింది.

    ఉత్తమ దర్శకుడు

    ఉత్తమ దర్శకుడు

    ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ 66వ ఫిలింఫేర్ అవార్డు దక్కించుకున్నాడు. మహానటి సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ 2019కి గానూ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు.

    స్పెషల్ జ్యూరి ఉత్తమ నటుడు

    స్పెషల్ జ్యూరి ఉత్తమ నటుడు

    దక్షిణాది ఇండస్ట్రీలో నటుడిగా మంచి పేరు సంపాదించాడు దుల్కర్ సల్మాన్. 'మహానటి' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో నటనకు గానూ ఉత్తమ నటుడిగా స్పెషల్ జ్యూరి అవార్డు ఈయనను వరించింది.

    స్పెషల్ జ్యూరి ఉత్తమ నటి

    స్పెషల్ జ్యూరి ఉత్తమ నటి

    కన్నడ భామ రష్మిక మందన్నను ఉత్తమ నటిగా స్పెషల్ జ్యూరి అవార్డు వరించింది. 'గీత గోవిందం' సినిమాలో ఆమె నటనకు గాను ఈ అవార్డు లభించింది.

    ఉత్తమ సహాయనటి..

    ఉత్తమ సహాయనటి..

    'రంగస్థలం' లో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకొని వెండితెరకు రంగమ్మత్తగా మారిపోయింది యాంకర్ అనసూయ. ఈ కారెక్టర్‌తో తన క్రేజ్ అమాంతం పెంచేసుకున్న ఈమె.. అదే సినిమాకు గాను ఉత్తమ సహాయనటిగా అవార్డు అందుకుంది.

    ఇంకా ఇతర కేటగిరీలు..

    ఇంకా ఇతర కేటగిరీలు..

    ఇక బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ కేటగిరీలో జగపతిబాబు (అరవింద సమేత), బెస్ట్ మ్యూజిక్ ఆల్బం కేటగిరీలో దేవి శ్రీ ప్రసాద్ (రంగస్థలం), బెస్ట్ లిరిక్స్ కేటగిరీలో చంద్రబోస్ (రంగస్థలం- ఎంత సక్కగున్నావే), బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్- సిద్ శ్రీరామ్ (ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె- గీతగోవిందం), బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫీమేల్- శ్రేయ ఘోషాల్ (మందార మందార- భాగమతి)లకు ఈ ఫిలింఫేర్ అవార్డులు వరించాయి.

    English summary
    66th Filmfare Awards South 2019 event was held at the Jawaharlal Nehru Indoor Stadium in Chennai. In these Awards Tollywood winners are.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X