»   » బాణాసంచా : 'హీరో' కి హీరోయిన్‌ ఈమే... ఫస్ట్‌లుక్‌ (ఫొటో)

బాణాసంచా : 'హీరో' కి హీరోయిన్‌ ఈమే... ఫస్ట్‌లుక్‌ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: హిందీ చిత్ర పరిశ్రమలో గత కొద్ది రోజులుగా అందరి నోట్లో నానుతున్న చిత్రం 'హీరో'. ఈ చిత్రం హీరో కు చెందిన ఫస్ట్ లుక్ ని ఇప్పటికే విడుదల చేసారు. అలాగే ఈ సారి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న అతియా శెట్టి పోస్టర్‌ను విడుదల చేశారు. అతియా శెట్టి ఫస్ట్‌లుక్‌ను నేడు నిఖిల్‌ అడ్వాణీ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు.

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్‌ పంచోలీ హీరోగా, సునిల్‌ శెట్టి కుమార్తె అతియా శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు నిఖిల్‌ అడ్వాణీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మొన్న హీరో సూరజ్‌ పంచోలీ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బాలీవుడ్‌ స్టార్ హీరో,కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా సుభాష్‌ ఘయ్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా ఇద్దరు వారసులు వెండితెర అరంగేట్రం చేస్తున్నారు.

ఆదిత్య పంచోలీ కుమారుడు సూరజ్‌ పంచోలీ, సునీల్‌ శెట్టి కూతురు అథియా శెట్టి కలిసి నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 25న విడుదల కానుంది. అథియా శెట్టి, సూరజ్ పంచోలి త్వరలో వెండి తెర తెరంగ్రేటం చేయబోతున్న నేపథ్యంలో ‘ఫిల్మ్ ఫేర్' మేగజైన్ కవర్ పేజీపై ది హాట్ బ్లడెడ్ అఫైర్ పేరుతో హాట్ ఫోజులు ఇచ్చారు.

హీరో' టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ స్వయంగా సల్మాన్ ఖాన్ నిర్మింస్తుండటం గమనార్హం. జియా ఖాన్ ప్రియుడైన సూరజ్ పంచోలి ఆ మధ్య ఆమె అనుమానాస్పద మృతిలో వివిధ ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నిఖిల్ అద్వాని దర్శకత్వం వహిస్తున్నారు.

సుభాష్ గయ్ దర్శకత్వంలో 1983లో వచ్చిన ‘హీరో' చిత్రానికి ఇది రీమేక్. ప్రస్తుతం ఈ చిత్ర పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. ఇందులో గోవింద, అనిత హాసనందిని, వినోద్ ఖన్నా, ఖాదర్ ఖాన్ నటిస్తున్నారు.

English summary
Nikhil Advani's 'firecracker' in the first look of Hero. The new star kid on the block, Athiya Shetty, is all set to make her Bollywood debut with Hero. Daughter of actor Suneil Shetty, Athiya will be seen opposite Sooraj Pancholi in the remake of 1983 hit film Hero. Advani took to Twitter to reveal her first look in the film.
Please Wait while comments are loading...