»   » నిఖిల్ నెక్ట్స్ మూవీ ప్రీ లుక్ ఇదే... బర్త్‌డే రోజు ఫస్ట్ లుక్

నిఖిల్ నెక్ట్స్ మూవీ ప్రీ లుక్ ఇదే... బర్త్‌డే రోజు ఫస్ట్ లుక్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  'కిర్రాక్ పార్టీ' సక్సెస్ తర్వాత హీరో నిఖిల్ తన తర్వాతి చిత్రం టి.యన్.సంతోష్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నిఖిల్ సరసన హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ నిఖిల్ బర్త్ డే సందర్భంగా జూన్ 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

  నిఖిల్ జర్నలిస్ట్ అర్జున్ లెనిన్ సురవరం అనే జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్నట్లు తాజాగా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. గన్ కంటే పెన్ చాలా పవర్‌ఫుల్ అనే కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

  First look of Nikhil’s next on his birthday

  'విక్రమ్ వేద' ఫేమ్ శ్యాం సి.ఎస్. సంగీతం సమకూరుస్తుండగా సూర్యా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ ల పై కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 'ఠాగూర్' మధు సమర్పిస్తున్నారు.

  First look of Nikhil’s next on his birthday

  ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, తరుణ్ అరోరా, సత్య, నాగినీడు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ : రాగా రెడ్డి, ఫైట్స్: వెంకట్డి,
  ఆర్ట్ డైరెక్టర్ : సాయి సురేష్, సంగీతం: శ్యాం సి ఎస్, ఛాయాగ్రహకుడు: సూర్యా, నిర్మాత: కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్, సమర్పణ: ఠాగూర్ మధు, బ్యానర్: ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి, కథ, స్క్రీన్ ప్లే & దర్శకత్వం: టీ.యన్.సంతోష్.

  English summary
  The first look of hero Nikhil Siddhartha’s upcoming movie will be released on June 1st which happens to be his birthday as well. The pre-look posters of the flick were unveiled and Nikhil is essaying the role of a journalist in the movie which is based on journalism backdrop and focuses more on the current issues and how media plays an important role in addressing them. This new film is being directed by TN Santhosh and Lavanya Tripathi is pairing with Nikhil in the movie. The shooting is in progress and Sam CS is rendering tunes.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more