»   » బాహుబలి ఫస్ట్ అఫీషియల్ సాంగ్ ఇదే .. (వీడియో)

బాహుబలి ఫస్ట్ అఫీషియల్ సాంగ్ ఇదే .. (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి' విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే సినిమాలోని ముఖ్య పాత్రలకు సంబందించి ఫస్ట్ లుక్ పోస్టర్లు, మేకింగ్ వీడియోలు విడుదల చేసి సినిమాపై అంచనాలు పెరిగేలా చేసారు.

ఇటీవల విడుదలై ట్రైలర్ ‘బాహుబలి' సినిమాపై అంచనాలు అమాంతం పెరిగేలా చేసాయి. ఆడియో వేడుక కనీ విని ఎరుగని రీతిలో గ్రాండ్‌గా జరిగింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధికంగా బడ్జెట్ రూ. 250 కోట్లు ఖర్చు పెట్టి రెండు భాగాలుగా తీస్తున్న ఈ సినిమాపై యావత్ భారతీయ సినీ ప్రేక్షక లోకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.


బాహుబలి సినిమాకు సంబంధించి ఏది విడుదలైన అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో భాగంగా బాహుబలి నుండి తొలి హిందీ వీడియో సాంగ్ విడుదల చేసారు. బాహుబలి చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్న కరణ్ జోహార్ తన ట్విట్టర్ ద్వారా ఈ వీడియోను రిలీజ్ చేసారు. ఆ తర్వాత రాజమౌళి అదే సాంగ్ తెలుగు వెర్షన్ సాంగ్ ‘మమతల తల్లి’ సాంగ్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు. ఆ వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి.


హిందీ వెర్షన్ సాంగ్...హిందీలో ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేస్తోంది. బాలీవుడ్లో ప్రమోషన్స్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటాయి. కరణ్ జోహార్ కోరిక మేరకు ప్రభాస్, రానా, తమన్నా ముంబైలో ఇప్పటికే తమ పని మొదలు పెట్టారు. రెండు రోజుల నుండి అక్కడ సినిమా ప్రచారం నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు.


జులై 10వ తేదీన బాహుబలి సినిమా ప్రపంచ వ్యప్తంగా తెలుగు, తమిళం, హిందీ మళయాలంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా ఎక్కవ మంది ప్రేక్షకులు రీచ్ కావడానికి విదేశాల్లో ఆయా భాషల్లో విడుదలువున్న ఈ చిత్రాన్ని సబ్ టైటిల్స్ అటాచ్ చేసి విడుదల చేస్తున్నారు.

English summary
Check out, Here is the first song from #Baahubali.
Please Wait while comments are loading...