»   » క్లైమాక్స్ కోసం అయిదుగురు దర్శకులా??..... తమిళ సినిమా తీరే వేరబ్బా..!!

క్లైమాక్స్ కోసం అయిదుగురు దర్శకులా??..... తమిళ సినిమా తీరే వేరబ్బా..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

గల్లీ క్రికెట్ నేపథ్యం లో వచ్చిన తమిళ చిత్రం "చెన్నై 600028" గుర్తుంది కదా..! అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఐదు అత్యుత్తమ చిత్రాల్లో ఇదొకటని ప్రఖ్యాత బ్రిటిష్ పత్రిక 'ది గార్డియన్' ప్రకటించింది. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2007 సం॥లో విడుదలై విశేష ప్రేక్షకాదరణతో పాటు విమర్శకులు ప్రశంసలు పొందింది. చెన్నై కేంద్రంగా రెండు క్రికెట్ జట్ల మధ్య జరిగే ఆధిపత్య పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ నేపథ్యంలో వచ్చిన అత్యుత్తమ చిత్రాలైన "ది లేడీ వానిషెస్", "లగాన్", "హోప్ అండ్ గ్లోరీ", "ఐ నో హౌ మేనీ రన్స్ యూ స్కోర్డ్", "లాస్ట్ సమ్మర్" చిత్రాల సరసన 'చెన్నై 600028' నిలిచింది. ఈ విశయం అప్పట్లో ఒక సంచలనం. దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని సరోజా, గ్యాంబ్లర్, రాక్షసుడు వంటి సినిమాలకూ దర్శకత్వం వహించాడు.

 Five directors to shoot climax of "Chennai 600028" sequel

తనదైన మార్క్ తో విభిన్నమైన సినిమాలతో మెప్పిస్తున్న వెంకట్ ప్రభు, ప్రస్తుతం తన తొలి సినిమా "చెన్నై 600028" కు సీక్వెల్ గా "చెన్నై 600028 - సెకెండ్ ఇన్నింగ్స్". మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విశేషం ఏమిటంటే తొలి సినిమా నేపథ్యం అయిన గల్లీ క్రికెట్‌ సబ్జెక్ట్ తో నే తెరకెక్కనున్న ఈ చిత్రం క్లైమాక్స్‌ను ఐదుగురు దర్శకులు చిత్రీకరించబోతున్నారన్న వార్త ప్రస్తుతం కోలీవుడ్‌‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

తన ప్రతి చిత్రంలోనూ క్లైమాక్స్‌ను భిన్నంగా చూపించే వెంకట్‌ప్రభు "చెన్నై28 రెండో ఇన్నింగ్స్‌" విషయంలోను అదే ఫాలో అవుతున్నారు. ఇందుకోసం ఐదుగురు దర్శకులతో క్లైమాక్స్‌ను చిత్రీకరించాలని నిర్ణయించి... తన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పనిచేసిన "నలనుం నందినియుమ్‌" ఫేమ్‌ వెంకటేష్‌ రామకృష్ణన్, "వడకర్రి" ఫేమ్‌ శరవణ్ రాజన్, "కనిమొళి" ఫేమ్‌ శ్రీపతి, "నవీన్ సరస్వతి శపథం" ఫేమ్‌ చంద్రు, "కావల్‌" ఫేమ్‌ నాగేంద్రన్‌లను ఎంపిక చేశారు.

 Five directors to shoot climax of "Chennai 600028" sequel

ఈ ఐదుగురూ ఇప్పటికే సెట్స్‌కు వెళ్లిపో యారు. ఐదుగురు దర్శకులు తెర కెక్కించనుండడంతో చెన్నై క్రికెట్ సినిమా సీక్వెల్‌‌పై అంచనాలు మరింత పెరిగాయి. మొదటి సినిమా మాదిరి గానే ఈ సినిమానీ ఇంకో హిట్ చేయాలనే పట్టుదలతో ఉన్న వెంకట్ ప్రభు.... ఇదే సెరీస్ లో మూడో చిత్రాన్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నాడట అయితే ఇప్పుడు వస్తున్న రెండో ఇన్నింగ్స్ ఫలితాలని బట్టి ఆ సినిమా సంగతి పై ఒక నిర్ణయానికి వస్తారట...

English summary
Venkat Prabhu is presently directing "Chennai-600028 II" the sequel to his blockbuster "Chennai-600028". five directors will collaborate to shoot the climax of This movie..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu