»   »  "సల్మాన్ చమ్చాగాళ్ళు" నా మాటలు నిజం చేసారు: గాయని సోనా మహాపాత్ర

"సల్మాన్ చమ్చాగాళ్ళు" నా మాటలు నిజం చేసారు: గాయని సోనా మహాపాత్ర

Posted By:
Subscribe to Filmibeat Telugu

రేప్ పై సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఒక వైపు ట్విట్టర్ లో దుమారం రేపుతుండగా.. మరో వైపు కొంతమంది ప్రముఖులు ఆయన వ్యాఖ్యలపై స్పందించారు. తన సినిమా "సుల్తాన్" నిర్మాణం పూర్తయిన తర్వాత తమ పరిస్థితి రేప్ కు గురైన మహిళలా ఉందంటూ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యల మీద దుమారం రేగుతూనే ఉంది.

అయితే ఇక్కడ సల్మాన్ ని సమర్థించే వారూ ఉన్నారు... అతని ఆలోచన అదికాదనీ... అతను చేసిన తప్పుకు తాను క్షమాపన అడుగుతున్నానంటూ సల్మాన్ తండ్రి చెప్పారు. ఇక కొందరు అభిమానులైతే సల్మాన్ వైఖరిని తప్పు పట్టిన వారందరినీ సల్మాన్ కంటే ఎక్కువగానే మాతలతో అవమానిస్తున్నారు.

సల్మాన్ ఖాన్ 'రేప్' వ్యాఖ్యలను తప్పుబట్టిన గాయని సోనా మహాపాత్రపై అతడి అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. సల్మాన్ ను 50 ఏళ్ల బాలుడిగా పోల్చడంపై ఫైర్ అయ్యారు. సల్మాన్ ఖాన్ 'రేప్' వ్యాఖ్యలపై స్పందిస్తూ...
మహిళల గెంటివేత, హిట్ అండ్ రన్, వన్యప్రాణుల వేట కేసుల్లో నిందితుడిగా ఉన్న హీరోకు దేశంలో అభిమానించేవారు ఉండడం విడ్డూరమని సోనా ట్వీట్ చేయగా... సల్మాన్ అభిమానులు ఆమె మీద విరుచుకు పడుతున్నారు..

For Criticising Salman Khan, Sona Mohapatra Trolled by Bhai Chamchas

"సల్మాన్ కేసుల గురించి మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది. భారత న్యాయవ్యవస్థలో నీవేమైనా భాగమా?" అని ఆమె ట్వీత్తర్ పోస్ట్ కింద కామెంట్లు పెడుతున్నారు. అంతే కాదు ఆమెను తమ అభిమాన నటుని తరహా లోనే అసభ్య పదజాలంతో తిడుతూ ట్వీట్లు పెట్టారు. అయితే సోనా వారి మాటలకు దీటుగా సమాధానం ఇచ్చారు.

"సల్మాన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించినందుకు నాకు ఫోన్ చేసి నన్ను 40 ఏళ్ల ఆంటీ అంటున్నారు. నేను ఆంటీ అయితే 50 ఏళ్ల సల్మాన్ బాలుడా? మీరంతా 50 ఏళ్ల బాలుడిని వెనకేసుకురావడం హాస్యాస్పదంగా ఉందంటూ" ఆమె ట్విటర్ లో పోస్ట్ చేశారు. తాను చేసిన కామెంట్స్ సరైనవేనని సల్మాన్ ఖాన్ 'చెమ్చాలు' నిరూపించారని సోనా కౌంటర్ ఇచ్చారు. సల్మాన్ కాస్త నీ అభిమానులకు సభ్యత నేర్పించు అంటూ చురక వేసారు.

English summary
Singer Sona Mohapatra Slammed On Twitter With Abuses - All For A Sarcastic Tweet On Salman Khan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu