»   » 2015కీ, 2016 కీ ఎంత తేడా... ఫోర్బ్స్ జాబితా షాకింగ్., మహేష్, బన్నీలు కూడా

2015కీ, 2016 కీ ఎంత తేడా... ఫోర్బ్స్ జాబితా షాకింగ్., మహేష్, బన్నీలు కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ ఫోర్బ్స్ మేగజైన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సినీ సెలబ్రిటీల వివరాలు ప్రకటించడం ప్రతి సంవత్సరం జరుగుతున్న వ్యవహారమే. ఈ లిస్టులో గత కొద్ది సంవత్సరాలుగా ప్రిన్స్ మహేష్ బాబు కొనసాగుతూనే ఉన్నా ఈ సంవత్సరం ఈ శ్రీమంతుడు తన ర్యాంక్ ను మరింత మెరుగు పరుచుకున్నాడు. బాలీవుడ్‌ కండల వీరుడు తన సత్తా మరోసారి చూపించాడు. సుల్తాన్‌తో బాక్సాఫీసు రికార్డులు తిరగరాసిన సల్మాన్‌ ఫోర్బ్స్‌-2016 ప్రముఖుల జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ రెండో స్థానంలో, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి మూడోస్థానంలో నిలిచారు. కాగా ఖ్యాతి పరంగా తొలి స్థానంలో కోహ్లి నిలిచాడు.

గతేడాది ప్రముఖుల జాబితాలో షారుఖ్‌ తొలిస్థానంలో నిలవగా.. సల్మాన్‌ రెండు, కోహ్లి ఏడో స్థానంలో నిలిచారు. సల్మాన్‌, షారుఖ్‌ స్థానాలు మార్చుకోగా.. కోహ్లి ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకాడు. ఈ ఏడాదికి సంబంధించి ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ టాప్‌- 100 భారతీయ ప్రముఖుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఆదాయం, ఫాలోయింగ్‌ ఆధారంగా వ్యక్తులకు స్థానాలు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో బాలీవుడ్‌ భామలు దీపికా పదుకొణె ఆరో స్థానంలో, ప్రియాంక చోప్రా 8వ స్థానంలో నిలిచారు. దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 30వ స్థానంలో నిలిచారు. ఇక తెలుగు హీరోలు కూడా ఈ జాబితాలో చోటుదక్కించుకున్నారు. మహేశ్‌బాబు (33), అల్లుఅర్జున్‌ (43), ఎన్టీఆర్‌ (55), రాంచరణ్‌ (67) స్థానాల్లో నిలిచారు.

2015 సంవత్సరం లో లిస్టుని కూడా:

2015 సంవత్సరం లో లిస్టుని కూడా:

ఒకసారి ఇదే లిస్టు ని 2015 సంవత్సరం లో లిస్టుని కూడా చూస్తే.... సంపాదన విషయంలో ఇండియన్ టాప్ 100 లిస్టులో చోటు దక్కించుకున్న ప్రముఖుల వివరాలను ఫోర్బ్స్ పోయినేడాది విడుదల చేసినప్పుడు ఆ టాప్ 100 లిస్టులో ఈ సారి ఎక్కువగా చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు చోటు దక్కించుకోవడం బట్టి గమనిస్తే మన సెలెబ్రెటీలు ఏ విధంగా ఆదాయంలో ఎదిగి పోతున్నారో అర్ధం అవుతుంది.

ప్రిన్స్ మహేష్ బాబు :

ప్రిన్స్ మహేష్ బాబు :

టాలీవుడ్ కు సంబంధించి సంపాదన విషయంలో ప్రిన్స్ మహేష్ బాబు అందరి కంటే ముందు ఉన్నాడు. ఇక ఈ టాప్ 100 లిస్టులో మహేష్ ఓవరాల్ గా 32వ స్థానంలో నిలవడమే కాకుండా ఫేమ్ విషయంలో 78ర్యాంక్ లో ఉండగా సంపాదన విషయంలో 13వ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు మహేష్. ఇక అల్లుఅర్జున్ ఓవరాల్ గా 42వ స్థానం దక్కించుకుని ఫేమ్ లో 67వ ర్యాంక్ ను సంపాదనలో 22వ ర్యాంక్ ను అందుకున్నాడు.

టాప్ 50 లిస్టులో:

టాప్ 50 లిస్టులో:

అయితే ఈ టాప్ 50 లిస్టులో కేవలం మహేష్ బన్నీలకు మాత్రమే స్థానం దక్కింది. అయితే ఈసారి నుకోని ట్విస్ట్ ఏమిటంటే ఈ టాప్ 100 లిస్టులో 'బాహుబలి' ప్రభావంతో రాజమౌళి ప్రభాస్ లకు కూడ స్థానాలు దక్కాయి. వీరితో పాటుగా మన టాలీవుడ్ కు సంబంధించి పూరి జగన్నాథ్ రవితేజ కాజల్ అగ్రవాల్ శ్రుతిహాసన్ లకు స్థానం లభించడంతో వీరందరూ కూడ టాలీవుడ్ శ్రీమంతులుగా మారిపోయారు.

ర్యాంకింగ్స్ లో :

ర్యాంకింగ్స్ లో :

మహేష్ మురగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ సినిమాకు 25 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు అన్న నేపధ్యంలో వచ్చే సంవత్సరానికి ఈ పత్రిక ప్రకటించే ర్యాంకింగ్స్ లో మరింత 'శ్రీమంతుడు' గా మహేష్ బాబు ఎదిగిపోయే అవకాశం ఉంది.. అని పోయిన ఏడాదే అనుకున్నారు ఆ అంచనలను నిజం చేసాడు ప్రిన్స్.

గతేడాది:

గతేడాది:

గతేడాది ప్రముఖుల జాబితాలో షారుఖ్‌ తొలిస్థానంలో నిలవగా.. సల్మాన్‌ రెండు, కోహ్లి ఏడో స్థానంలో నిలిచారు. సల్మాన్‌, షారుఖ్‌ స్థానాలు మార్చుకోగా.. కోహ్లి ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకాడు. ఈ ఏడాదికి సంబంధించి ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ టాప్‌- 100 భారతీయ ప్రముఖుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఆదాయం, ఫాలోయింగ్‌ ఆధారంగా వ్యక్తులకు స్థానాలు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే.

30వ స్థానంలో:

30వ స్థానంలో:

ఈ జాబితాలో బాలీవుడ్‌ భామలు దీపికా పదుకొణె ఆరో స్థానంలో, ప్రియాంక చోప్రా 8వ స్థానంలో నిలిచారు. దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 30వ స్థానంలో నిలిచారు. ఇక తెలుగు హీరోలు కూడా ఈ జాబితాలో చోటుదక్కించుకున్నారు. మహేశ్‌బాబు (33), అల్లుఅర్జున్‌ (43), ఎన్టీఆర్‌ (55), రాంచరణ్‌ (67) స్థానాల్లో నిలిచారు.

English summary
Actor Salman Khan’s total earnings constituted 9.84 percent of the total wealth of all the top 100 celebrities for the year
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu