twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నచ్చకుంటే చూడకండి, మెర్సల్ వాటికంటే ప్రమాదకరమా?:: మెర్సల్ వివాదానికి తెర దించిన మద్రాస్ హైకోర్ట్

    భావ ప్రకటనా స్వేచ్చ అందరికీ సమానమే ఈరోజు మద్రాసు హైకోర్టు దేశవ్యాప్త వివాదాలకు మూలమైన మెర్సల్ సినిమా గురించి ఈ విధంగా వ్యాఖ్యానించింది. అంతే విజయ్ అనే నటుడు తమిల సినిమాల్లో మాత్రమే హీరో అనీ నిజజీవితం

    |

    అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన 'మెర్సల్' చిత్రంలో జీఎస్టీ, నోట్ల రద్దుతో పాటు వైద్యుల పట్ల వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ ఉండటంతో బీజేపీకి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. మెర్సల్ చిత్రంలో కొన్ని అభ్యంతరకర డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయి. వీటిపై తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది.

    Recommended Video

    "Mersal" Telugu Version Delayed మనోళ్ళు తమిళ వెర్షన్ ని వదల్లేదు..
    మద్రాస్ హైకోర్ట్

    మద్రాస్ హైకోర్ట్

    మెర్సల్ సినిమాలో తప్పుడు సమాచారం తో డైలాగ్స్ ఉన్నాయనీ, కొన్ని సీన్లు ప్రభుత్వం పట్ల, జీఎస్టీ పన్ను విధానం పట్లా జనాలని పక్కదారి పట్టించే విధంగానూ ఉండటం వల్ల మెర్సల్ సినిమా కి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ వెనక్కి తీసుకోవాలనీ వేసిన పిటీషనర్ల వాదనని మద్రాస్ హైకోర్ట్ నిర్ద్వందంగా తోసిపుచ్చింది.

    మెర్సల్ మూవీని రీ సెన్సార్ చేయాలంటూ

    మెర్సల్ మూవీని రీ సెన్సార్ చేయాలంటూ

    తమిళ సినిమా మెర్సల్ మూవీని రీ సెన్సార్ చేయాలంటూ మ‌ద్రాస్ హైకోర్టులో పిల్ దాఖ‌లైంది.. నోట్ల రద్దు, జీఎస్టీపై ఆ ఫిల్మ్‌లో నెగటివ్ డైలాగ్స్ ఉన్నాయి. దీంతో బీజేపీ ఆ ఫిల్మ్ లో కొన్ని సీన్స్ తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్న‌ది. అయితే సెన్సార్ పూర్తి చేసుకుని ఈ మూవీ రిలీజ్ కావ‌డంతో డైలాగ్స్‌ను కట్ చేసే వీలు లేకుండా పోయింది.

    సెన్సార్‌ను సీబీఎఫ్‌సీ పునర్ పరిశీలించాలని

    సెన్సార్‌ను సీబీఎఫ్‌సీ పునర్ పరిశీలించాలని

    దీంతో ఓ అడ్వకేట్ ఆ ఫిల్మ్‌పై పిల్ వేశారు. మైలాపూర్‌కు చెందిన అడ్వకేట్ అశ్వథామన్.. సినిమా సెన్సార్‌ను సీబీఎఫ్‌సీ పునర్ పరిశీలించాలని మద్రాస్‌హై కోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం కింద పిటిషన్ వేశారు. విజయ్ నటించిన మెర్సల్ ఫిల్మ్.. జీఎస్టీ, నోట్ల రద్దుపై దేశాన్ని తప్పుగా చూపించిందన్నారు.

    సినిమా అంటేనే ఊహాజనితం

    సినిమా అంటేనే ఊహాజనితం

    సినిమాలో ఉన్న డైలాగ్‌లు, సీన్లు.. మన కొత్త పన్ను విధానాన్ని బలహీనంగా చూపిస్తున్నదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ రోజు తన తీర్పుని వెలువరించింది. సాధారణంగా సినిమా అంటేనే ఊహాజనితమని నచ్చకపోతే చూడొద్దని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.

    మెర్సల్‌ అనేది ఓ చిత్రం కల్పితగాథ

    మెర్సల్‌ అనేది ఓ చిత్రం కల్పితగాథ

    శుక్రవారం ఆ పిటిషన్‌ బెంచ్‌ ముందుకు రాగా.. దానిని కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. మెర్సల్‌ అనేది ఓ చిత్రం కల్పితగాథేనని.. నిజ జీవితం కాదని ఈ సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇది సమాజంపై ప్రభావం చూపుతుందనటం అర్థరహితమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    నచ్చకపోతే చూడకండి

    నచ్చకపోతే చూడకండి

    ధూమపానం, మద్యపానం హనికరమంటూ ప్రకటనలు జారీ చేసే చిత్రాలకంటే మెర్సల్‌ అంత ప్రమాదకరమైందా అంటూ న్యాయమూర్తి పిటిషనర​ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. సినిమా నచ్చకపోతే చూడకండి.. అంతేగానీ ఇలా పిటిషన్లతో సమయాన్ని వృథా చేయకండి అంటూ మండిపడ్డారు.

    'మెర్సెల్‌'కు కాస్త ఊరట

    'మెర్సెల్‌'కు కాస్త ఊరట

    వివాదాలతో సినిమాకు ఫ్రీ పబ్లిసిటి లభించిందని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ తీర్పు 'మెర్సెల్‌'కు కాస్త ఊరటనిచ్చింది. అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన 'మెర్సల్' చిత్రం కలెక్షన్లతో పాటు.. కాంట్రవర్శీలతోనూ దూసుకుపోతోంది. తమిళంలో ఈ సినిమా దీపావళికి విడుదలైంది.

    బీజేపీ ఆగ్రహానికి గురైంది

    బీజేపీ ఆగ్రహానికి గురైంది

    ఈ సినిమాలో జీఎస్టీ, నోట్ల రద్దుతో పాటు వైద్యుల పట్ల వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ ఉండటంతో బీజేపీ ఆగ్రహానికి గురైంది. దీంతో ఈ సినిమా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ నిర్వహించిన అనంతరం కోర్టు ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది.

    అదిరింది కూడా బయటకు వచ్చే అవకాశం

    అదిరింది కూడా బయటకు వచ్చే అవకాశం

    ఈ తీర్పుతో తెలుగు వెర్షన్ "అదిరింది" విషయంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటిదాకా తమిళ వెర్షన్ వల్ల ఏర్పడ్డ దుమారం వల్లనే తెలుగులో మళ్ళీ అవే డైలాగులతో అనుమతించటానికి వెనకడుగు వేసారు సెన్సార్ బోర్డ్ సభ్యులు, తాజా తీర్పు నేపథ్యం లో ఇక తెలుగు అదిరింది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది..

    English summary
    Freedom of expression is for all, the Madras High Court on Friday said while hearing a plea seeking to revoke the censor certificate for 'Mersal'. The court said that the Vijay-starrer Tamil movie is only a film and not real life. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X