»   » గబ్బర్ సింగ్ 2 : వాటి కోసం వేట సాగుతోంది

గబ్బర్ సింగ్ 2 : వాటి కోసం వేట సాగుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నటించబోయే ‘గబ్బర్ సింగ్ 2' చిత్రానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే దానిపై సరైన క్లారిటీ లేక పోయినా ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం దర్శకుడు బాబీ, సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ లొకేషన్ల వేటలో ఉన్నారట. రాజస్థాన్, మహారాష్ట్రల్లో సినిమాకు తగిన లొకేషన్ల కోసం వేట సాగిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం లాంచింగ్ మే 29న జరుగనుందని టాక్.

ఈ చిత్రానికి కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిషా అంబ్రోస్ లీడ్ హీరోయిన్. మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో పూర్తయినట్లు సమాచారం.

pawan kalyan

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలెట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కూడా అతనే కావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

కథరీత్యా మరో హీరోయిన్ కూ చోటుందని సమాచారం. ఆ హీరోయిన్ మరెవరో కాదు...త్రిష అని తెలుస్తోంది. ఈ మేరకు ఆమెను సంప్రదించారని చెప్పుకుంటున్నారు. అయితే కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని యూనిట్ అభిప్రాయపడుతోందని మరో ప్రక్క వార్తలు వినపడుతున్నాయి. ఈ విషయమై ప్రొడక్షన్ టీమ్ కామెంట్ చేయటానికి ఇష్టపడటం లేదు. త్వరలోనే ఆ హీరోయిన్ ఎవరనేది తేల్చి అఫీషియల్ గా మీడియాకు స్టేట్ మెంట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రం గబ్బర్‌సింగ్‌కు సీక్వెల్ కాదని, ప్రేమ, వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో మేళవించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం, ఆలీ, నర్రా శ్రీనులను తారాగణంగా ఎంచుకున్నారు. హిందీ చిత్ర పరిశ్రమ నుంచి మరికొంత మందిని తీసుకుంటారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్, కెమెరా: జైనన్ విన్సెంట్, ఆర్ట్: ఆనంద్‌సాయి, కాస్ట్యూమ్స్ భానూమోరే, క్రియేటివ్ హెడ్: హరీశ్‌పాయ్.

    English summary
    Gabbar Singh 2, is finally nearing its pre-production work. Bobby and Jayanan Vincent, are currently looking for suitable locations in the interiors of Maharashtra and Rajasthan.
    Please Wait while comments are loading...