Don't Miss!
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Sports
వరల్డ్ కప్ ఫైనల్ ముందు అండర్-19 జట్టుకు సర్ప్రైజ్.. మోటివేట్ చేసిన నీరజ్ చోప్రా!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
దూకుడులో దుమ్ము రేపిన పార్వతి మెల్టన్ పవన్ గబ్బర్ సింగ్ లో...!
దూకుడు సూపర్ హిట్ అవ్వడం మహేష్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు, హీరోయిన్ పార్వతి మెల్టన్ కు కెరీర్ కూడా ఓ ఊపు తీసుకొచ్చింది. దూకుడులో కనిపించింది ఐదు నిమషాలే అయినా కుర్రకారును ఊపేసింది. సినిమా హీరోయిన్ సమంతాకు ధీటుగా తన ముద్ర పడేలా చేసుకుంది పార్వతి మెల్టన్. దర్శకుడు శ్రీను వైట్ల కూడా పార్వతి మెల్టన్ అందాన్ని కరెక్ట్ గా తెరకెక్కించడంతో అటు సాంగ్, ఇటు పార్వతి మెల్టన్ కూడా సూపర్ హిట్ అయ్యాయి.
మహేష్ ఖలేజాలో మొదట హీరోయిన్ గా పార్వతి మెల్టన్ ను అనుకున్నారు. అయితే ఆ ప్లేస్ లోకి అనుష్క రావడంతో పార్వతి మెల్టన్ కు దూకుడులో ఐటం సాంగ్ కు అవకాశం ఇచ్చారు. ఐటం సాంగ్ ఛాన్స్ ను చక్కగా ఉపయోగించుకున్న పార్వతి మెల్టన్ కు ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయట. ఆమె కూడా ఐటం సాంగ్ క్రేజ్ బట్టి చేయడానికి ఓకే అంటుందని తెలుస్తుంది.
తాజాగా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో ఐటం సాంగ్ (హిందీ దబాంగ్ లోని మున్ని బద్నాం సాంగ్) కూడా పార్వతి మెల్టన్ ఖాతాలోనే పడబోతుందని సమాచారం. ప్రస్తుతం పార్వతి మెల్టన్ సాయిరామ్ శంకర్ నటిస్తున్న యమహో యమ అనే ఫాంటసీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.